కొందరి మధ్య సరదా డిస్కషన్స్ జరిగినప్పుడు సరదా ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కోడి ముందా? గుడ్డు ముందా?.. ఈ చిక్కు ప్రశ్నకు ఎప్పటి నుండో సమాధానం అనేది ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అయితే ఆ మధ్య కోడే ముందని ఆధారాలతో సహా నిరూపించారు. జీవ పరిణామక్రమంపై ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఈ అంశానికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరీసృపాలు, పక్షులు, జంతువులు మొదలైనవి ప్రస్తుతం మనం చూస్తున్న రూపం సంతరించుకోక మునుపు నేరుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చారు.
51 శిలాజాలు, ప్రస్తుతం జీవించి ఉన్న 29 జంతుజాతుల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు.164 మిలియన్ సంవత్సరాల క్రితం కాలక్రమంలో కోడి శరీరంలో గుడ్డు ఏర్పడిందని తేల్చింది. మొదట్లో దీనిని తినడానికి చికెన్ లాగా వాడుతుండేవారు. అలా తినే సమయంలో పొట్టు లాంటిది దాని శరీరంలో కనిపించిందని అది గుడ్డుగా మారిందని చెబుతున్నారు. ఏడు వేల సంవత్సరాల నుంచి ఈ గుడ్డుకు సంబంధించిన విషయాన్ని కనుక్కొన్నారని ఆ యూనివర్సిటీ తెలిపింది. రాబోయే రోజుల్లో కోడి ముందా గుడ్డు ముందా అనేది పూర్తి స్థాయిలో తేల్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగుతాయన్నారు. అయితే దీనిపై డాక్టర్ మాథర్ కూడా ఒక సమాధానం ఇచ్చారు. మొదటి నిజమైన కోళ్లు పరిణామ పరివర్తన పూర్తయిన సమయంలో అడవి కోడి పెట్టిన గుడ్ల నుండి పొదిగి ఉండవచ్చు.
ప్రశ్న కోడి గుడ్లను సూచిస్తున్నట్లు అర్థం చేసుకుంటే, అప్పుడు సమాధానం కోడి అవుతుంది. కాబట్టి, చివరికి, గుడ్డు మరియు కోడి రెండింటిపై ఫోకస్ ఉంటుంది. రాబోయే తరాల వారికి ఈ గుడ్డ గురించి చర్చ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది.రాబోయే రోజుల్లో కోడి ముందా గుడ్డు ముందా అనేది పూర్తి స్థాయిలో తేల్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగుతాయన్నారు.ఇలాగే ఇంకా విశ్వంలో తేలని ప్రశ్నలు చాలా ఉన్నాయి. చెట్టు ముందా విత్తనం ముందా.. ఇలా ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చెట్టు ముందు అంటే విత్తనం భూమిలో మొలకెత్తితేనే కదా చెట్టుగా మారేది. చెట్టు ఉంటేనే కదా విత్తనం వచ్చేది. ఇలాంటి మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సరైన సమాధానం దొరకాలంటే ఎన్నో వినూత్న ప్రయోగాలు జరగాలి.