మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. వేళకు నిద్రపోయి వేకువజామునే నిద్ర లేస్తే ఆరోగ్యంగా ఉంటారని మన పెద్దలు అంటారు. పెద్దలు 7 నుండి 9 గంటల పాటు నిరంతరాయంగా నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఇంగ్లండ్‌లో జరిపిన పరిశోధనలు నిద్ర ఆవశ్యకతను మరింత నొక్కిచెప్పాయి. జర్నల్ ఆఫ్ సైకియాట్రీ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనా పత్రంలో, ఫలితాలు రాత్రి 1 గంటకు ముందు పడుకోవడం వల్ల ఆందోళన, నిరాశ వంటి మానసిక , ప్రవర్తనా రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించాయి. దాదాపు 74,000 మంది నిద్ర విధానాలను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. పరిశోధకులు పాల్గొనేవారి ఇష్టపడే నిద్ర సమయాన్ని వారి అసలు నిద్ర అలవాట్లతో పోల్చారు, దీనిని క్రోనోటైప్ అని పిలుస్తారు.
న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, రాత్రి గుడ్లగూబలా మేల్కొనేవారే యాక్టివ్‌గా ఉంటారని అందులో పరిగణించబడింది. 26,000 మంది వ్యక్తులపై నిర్వహించిన పరిశోధనలో “ఆలస్యంగా మేల్కొనే వారు తెలివితేటలు, జ్ఞాపకశక్తి మెరుగ్లా ఉన్నట్టు అందులో కనుగొన్నారు. అయితే దీనిపై హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లోని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. క్రోనోటైప్‌లు జన్యుపరంగా నిర్ణయించబడతాయి మరియు వాటిని మార్చలేము. రాత్రి గుడ్లగూబ ఆలస్యంగా పడుకోవడానికి , లేట్‌గా మేల్కోవడానికి ఇష్టపడుతుంది.
ఇటీవలి కాలంలో వృత్తిపరమైన కట్టుబాట్లు లేదా జీవనశైలి విధానాల కారణంగా ప్రజలు వేర్వేరు సమయాలలో నిద్రపోతుంటారు. అయితే మెలటోనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడే శరీరం పనితీరుకి అనుగుణంగా, ఎల్లప్పుడూ 12 గంటలలోపు నిద్రపోవాలని అతను చెప్పుకొచ్చారు. అయితే చాలా సందర్భాలలో, రాత్రి గుడ్లగూబలు తమ జన్యుపరమైన స్వభావంతో సంబంధం లేకుండా త్వరగా మేల్కొనే వారి కంటే మెరుగ్గా పనిచేస్తాయని గమనించబడింది అని అన్నారు పెద్దలకు సరైన నిద్ర అవసరం గురించి డాక్టర్ కుమార్ మాట్లాడుతూ, “ఏడు నుండి తొమ్మిది గంటల నిద్ర అవసరం. ఏడు గంటల కంటే తక్కువ లేదా తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయిన సందర్భాల్లో, ఒక వ్యక్తి ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండెపోటు మరియు కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది అని డాక్టర్ కుమార్ చెప్పారు.