వెల్లుల్లిని నిత్యం మనం అనేక వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. వెలుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అయితే దీంతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో 2 వెల్లుల్లి రెబ్బలను నలిపి వేయాలి. కొద్దిగా మిరియాల పొడి వేయాలి. 5 నిమిషాల పాటు మరిగించాక దించి నీటిని వడకట్టాలి. అందులో అవసరం అనుకుంటే నిమ్మరసం, తేనె కలపవచ్చు. దీంతో వెల్లుల్లి టీ తయారవుతుంది. దీన్ని రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేశాక తాగాలి. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
వెల్లుల్లి టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. హైబీపీ తగ్గుతుంది.
వెల్లుల్లి టీని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల బాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంలో వాపులు ఉన్నవారు కూడా ఈ టీని తాగవచ్చు. దీంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి.