Lord Vishnu : ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది. మన కోరికలు నెరవేరాలంటే ఈ కథ విన్నా, ఈ నామం పలికినా కూడా నెరవేరుతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదివితే.. ఆ తరంగాలు కలిపురుషుడిని తాకాయట. గంగా నది తీరంలో ఒక ముసలి ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి, ఆ మంత్ర జపాన్ని ఆపాలని కలి వెళ్లాడు. ఆయన మీద చేయి వేస్తే వెంటనే ఎగిరి అర కిలోమీటర్ల దూరంలో పడిపోయాడు కలి.
కొంతసేపు ఏం జరిగిందో కూడా అసలు అర్థం కాలేదు. ఆ తరవాత చూస్తే ఆ ముసలివాడు ఎక్కడో దూరంగా జపిస్తున్నాడు. ఎలా అయినా నామ జపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. మళ్లీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా దూరంలో పడ్డాడు. దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. ఇతను చూస్తే ముసలాయన నన్ను మాత్రం ఎగిరిపోయేలా చేస్తున్నాడు. ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా..?
ఇంతకీ ఈ ముసలాయన ఎవరు..? శివుడా, విష్ణువా అనుకుంటూ వెళ్తుంటే.. వేదవ్యాసుడు కనపడ్డాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి అని చెప్తాడు. వేద వ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యం. ఈ కలికాలం నీది. నీకే సందేహమా అని అంటాడు. ఎవరైనా కలిసి ఉన్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది. ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అంటాడు.
ఇది అసలు నా రాజ్యమేనా..? ఆయన్ని పట్టుకుంటే, నా బలం సరిపోలేదు అని అంటాడు. వేద వ్యాసుడు నవ్వి ఓహో అదా అని సందేహం. నాకు అర్థమైంది. పరమ విష్ణు భక్తుడు ఆయన. ఆయన జపించే నామం వల్ల విష్ణు శక్తి ఉత్పన్నమై, నిన్ను దగ్గరికి రానివ్వడం లేదు. విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగమే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని పఠిస్తూ ఎవరైతే ఉంటారో.. వాళ్లని కనీసం నువ్వు తాకలేవు. ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపు, నువ్వు పట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతటి విశిష్టమైన మంత్రాన్ని నిత్యం జపిస్తే, ఎంతో మంచి జరుగుతుందని అంటారు.