పొరపాటున కూడా స్త్రీలు ఇటువంటి పనులు చేయకూడదు. స్త్రీలు తప్పులు చేయడం వలన దరిద్రం పట్టుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం, జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం అస్సలు మనం కొన్ని తప్పులు చేయకూడదు. కొన్ని పనులు చేయడం వలన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వచ్చి, పాజిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అని గుర్తు పెట్టుకోండి. దరిద్రం పట్టుకుంటే అనారోగ్య సమస్యలు మొదలు ఎన్నో సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ఇటువంటి తప్పులు చేయడం వలనే దరిద్రం పట్టుకుంటుంది.
స్త్రీ ని ఇంటి దీపాలు అంటారు. అంటే దారి చూపించడానికి మార్గదర్శకులు. సలహాలు ఇచ్చే మంత్రులు. స్త్రీలే భర్త, పిల్లల బాగోగులు చూసుకోవాలి. వారు తప్పులు చేయకుండా ఉండేలా భార్యలే చూసుకోవాలి. మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం తప్పు. ఆ తప్పును ఎప్పుడూ చేయకుండా స్త్రీలు భర్తలకి చెప్పాలి. స్త్రీలు నల్లని బట్టలు కట్టుకోకూడదు. అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే వరకు ఉండే రోజులని శుక్లపక్షం అంటారు. ఈ సమయంలో మంచి పనులు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.
ఇంటిని ప్రతిరోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం చీకటి పడక ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత చెత్తని బయట పారేయకూడదు. ఈ తప్పు చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సాయంత్రం అయిన తర్వాత ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ఆవకాయలని బయట వాళ్లకి ఇవ్వకూడదు.
ఇంట్లో జుట్టు విరబోసుకుని స్త్రీలు తిరగకూడదు. దుమ్ము, ధూళి, చెత్త, చెదారాన్ని మంగళవారం, శుక్రవారం తొలగించకూడదు. స్త్రీలు ఎప్పుడూ మంచి పదాలని మాత్రమే మాట్లాడాలి. శని, పీడ, దరిద్రం, పీనుగ వంటి పదాలని స్త్రీలు పలకకూడదు. ఇలాంటివి అనడం వలన చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.