మొదటగా నాగార్జున ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చాడు తప్ప ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాలేదు. దాంతో అందరూ నాగార్జున సినిమాలకి పనికిరాడు అంటూ కొన్ని విమర్శలు చేశారు. చూడడానికి కూడా చాలా బక్కగా ఉన్నాడు. ఈయన ఏం హీరో అంటూ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ చాలా తొందరలోనే అందరికీ తన సినిమాలతో సమాధానం చెప్పాడు.
గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఆ సినిమాలో చూడడానికి అసలు బాగుండడు. దాంతో ఆ సినిమా చూసిన చాలామంది అల్లు అర్జున్, అల్లు అరవింద్ కొడుకు కాబట్టి సినిమాల్లో హీరో అయ్యాడు. అంతే గంగోత్రి సినిమాలో కాన్సెప్ట్ బావుంది కాబట్టి సినిమా హిట్ అయింది తప్ప ఆయన అసలు హీరో మెటీరియల్ కాదు అని అందరూ చాలా విమర్శలు చేశారు. దాంతో ఇలా అయితే వర్కౌట్ కాదు అని అల్లు అర్జున్ ఆర్య సినిమాలో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమా తోనే స్టార్ హీరోగా మారాడు. అయితే కెరీర్ మొదట్లో మొత్తం కమర్షియల్ సినిమాలు చేస్తూ ఒకే టైపు అఫ్ స్టోరీలని చేస్తూ వచ్చాడు. దాంతో రామ్ చరణ్ కి యాక్టింగ్ సరిగ్గా రాదు. ఈయన చిరంజీవి కొడుకు కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో ఫెడ్ అవుట్ అయ్యేవాడు అంటూ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్.