Cheepuru : ప్రతి ఒక్కరు కూడా, లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉండాలని అనుకుంటుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే, మనం కొన్ని తప్పులు చేయకూడదు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే, తెలిసి కానీ తెలియక కానీ, కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగే విధంగా, అసలు నడుచుకోకూడదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా, చీపురు ఉంటుంది. చీపురుని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. చీపురు తో కనుక పొరపాట్లు చేసినట్లయితే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కొత్త చీపురుని ఎప్పుడు కొనాలి అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోండి.
వాస్తు ప్రకారం, శనివారం నాడు కొత్త చీపురు ని కొనడానికి చాలా మంచిది. పవిత్రమైన రోజుగా పరిగణించడం జరిగింది. శనివారం నాడు, కొత్త చీపురుని కొంటే, ఇంట్లో శాంతి ఏర్పడుతుంది. సంతోషం ఉంటుంది. ఇలా చేస్తే, లక్ష్మీదేవి కూడా సంతోషపడుతుంది.
కృష్ణపక్షంలో ఏదైనా శనివారం నాడు, చీపురుని కొంటే మంచిది. శుక్లపక్షంలో ఎప్పుడు కొత్త చీపురు కొనొద్దు. దురదృష్టం కలుగుతుంది. పౌర్ణమి నుండి అమావాస్య వచ్చే రోజులను కృష్ణపక్షం అంటారు. అమావాస్య నుండి వచ్చే పౌర్ణమి ని శుక్లపక్షం అని అంటారు. చీపురుని ఎప్పుడు కూడా కళ్ళ ముందు పెట్టకూడదు. ఇంట్లో దానిని దాచి పెట్టి ఉంచాలి. ఇంటి బయట కూడా, బహిరంగ ప్రదేశంలో చీపురుని పెట్టకూడదు.
దీని వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. చీపురుని నిటారుగా ఉంచకూడదు. చీపురు ని పడుకోబెట్టి ఉంచాలి. కొత్త చీపురుని కొన్నాక, పాత చీపురు ని పడేస్తూ ఉంటాము. వాస్తు ప్రకారం, పాత చీపురుని గురువు శుక్రవారంలో ఎట్టి పరిస్థితుల్లో బయటపడేయకూడదు. అమావాస్య లేదంటే శనివారం రోజుల్లో మాత్రమే పాత చీపురుని బయట పడేయాలి. ఇలా, ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. లేదంటే, అనవసరంగా మీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.