Cinnamon Powder With Milk : దాల్చినను మనం, పలు రకాల వంటల్లో వాడుతూ ఉంటాము. కూరలు లేదంటే బిర్యానీ వంటివి చేయడానికి వాడుతూ ఉంటాము. దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. పాలతో పాటుగా దాల్చిన చెక్క పొడి తీసుకుంటే, చక్కటి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. శరీరంలో ఇన్సులిన్ లోపం వలన, మధుమేహం సమస్య వస్తుంది. ఇన్సులిన్ శరీరంలో గ్లూకోస్ స్థాయిలని నియంత్రిస్తుంది. టైప్ టు డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. కానీ తక్కువ చేస్తుంది.
ఇన్సులిన్ అనేది జీర్ణ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడే హార్మోన్ అన్న విషయం మనకి తెలుసు. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రించడానికి అందరూ మందులు తీసుకుంటూ ఉంటారు. ఒత్తిడికి దూరంగా ఉండడం, ఆహారాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుకోవాలంటే, ఈ నియమాలని కచ్చితంగా పాటించాలి.
ఆహారం తిన్న తర్వాత, ఐదు నిమిషాలు నడిస్తే, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. దాల్చిన చెక్క షుగర్ పేషంట్లకి ఒక వరం. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు దాల్చిన లో పుష్కలంగా ఉంటాయి. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు ఆల్ఫా కేరోటిన్ వంటివి కూడా ఉంటాయి. దాల్చిని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
దాల్చిన చెక్కను తీసుకుంటే, డయాబెటిక్ పేషెంట్లు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం నుండి దూరంగా ఉండొచ్చు. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు, దాల్చిన చెక్కని పాలల్లో కలిపి తీసుకుంటే, ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. కాబట్టి, ఖచ్చితంగా ఈ ఒక్క విషయాన్ని కూడా పాటించడం మంచిది.