Heart Attack : ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలకి గురవుతున్నారు. ఎక్కువగా గుండెపోటుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు. గుండెపోటు తర్వాత మొదటి గంట ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఈ మొదటి గంటలోపు తగిన చర్యలు తీసుకుంటే ప్రాణాల నుండి బయటపడవచ్చు. లేదంటే ప్రాణాలే పోతాయి. గుండెపోటు మరణాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి గుండెపోటుకి సంబంధించిన ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
గుండెపోటు కలిగినట్లయితే వెంటనే ఆసుపత్రికి చేరుకోవాలి. గుండెపోటు వచ్చినప్పుడు రోగి రెండు లేదా నాలుగు గంటలలోపు చికిత్స పొందితే గుండె కండరాలకి నష్టం లేకుండా ఉండవచ్చు. ఐదు నుండి ఆరు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే గుండె కండరాల యొక్క ముఖ్యమైన ప్రాంతం దెబ్బతింటుంది. 12 గంటల తర్వాత వైద్యం చేసినట్లయితే అది చాలా ప్రమాదకరం.
సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ ప్రకారం దాదాపు 47 శాతం మంది ఆసుపత్రికి చేరుకునేలోగానే ఆకస్మికంగా గుండె ఆగిపోవడం జరుగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యం. గుండెపోటు వచ్చిన ఆరు గంటల్లోగా వైద్యం తీసుకోకపోతే వ్యక్తి ప్రాణానికి చాలా ప్రమాదం. గుండె పోటు వచ్చిన 90 నిమిషాలలో గుండె కండరం పాడైపోతుంది. కనుక వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లడం మంచిది. దెబ్బతిన్న గుండె కండరాలు మాత్రమే కాకుండా అసాధారణ హృదయ స్పందన వలన కూడా ప్రమాదమే ఉంటుంది.
గుండెపోటు వచ్చిందంటే ఛాతి నొప్పి మొదట వస్తుంది. ఛాతిలో భారంగా, మంటగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. విశ్రాంతి లేకపోవడం, బాగా చెమట పట్టడం, దవడ నొప్పి, ఎడమ చేయి నొప్పి, వీపులో నొప్పిగా ఉండడం వంటివి గుండెపోటు రావడానికి ముందు కలుగుతాయి. గుండెపోటు వచ్చిన వెంటనే ఆంబులెన్స్ కి కాల్ చేసి వెంటనే ఆసుపత్రికి చేరడం ముఖ్యం. సరైన సమయానికి ఆసుపత్రికి వెళ్లి వైద్యం తీసుకుంటే, గుండెపోటు వచ్చిన తర్వాత కూడా సరైన వైద్యం తీసుకుని, మళ్ళీ ఆరోగ్యవంతులు అవ్వచ్చు.