Feeding To Cow : గోమాతని దైవంగా భావించి మనం పూజలు చేస్తూ ఉంటాము. సిటీలలో గోమాతని పూజించడం చాలా తక్కువగా ఉంటోంది. కానీ పల్లెటూర్లలో మాత్రం ప్రతిరోజూ గోమాతని పూజిస్తూ ఉంటారు. ప్రత్యేకించి గోవుని ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల గోశాలలు కూడా ఉంటున్నాయి. అక్కడకి కూడా వెళ్లి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. ఆవులకి ఆహార పదార్థాలు పెడుతూ ఉంటారు. గోవు నుండి వచ్చే ప్రతిదీ కూడా మానవులకి ఉపయోగపడే విధంగా ఉంటుంది.
గోవులో సకల దేవతలు ఉంటారు. ఆవుని పూజించినట్లయితే సమస్త దేవతలందరినీ కూడా పూజించినట్లే. ఆవులకి గడ్డి ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఎప్పుడూ గడ్డి మాత్రమే కాకుండా బెల్లంతో చేసిన వంటకాలను, బియ్యంతో చేసిన వంటకాలను కూడా గోమాతకి పెడితే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. వృత్తిలో నిలకడ ఉండాలంటే కచ్చితంగా గోమాతకి నానబెట్టిన ఉలవలు పెట్టండి.
ఆహారం కింద గోమాతకి నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ ఉంటుంది. ధనాభివృద్ధి కోసం నానబెట్టిన బొబ్బర్లని ఆహారంగా గోమాతకి పెట్టండి. గోధుమలు నానబెట్టి పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. శనగలను నానబెట్టి గోమాతకి ఆహారం కింద పెడితే ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది.
బియ్యం పిండి, బెల్లం కొంచెం నీటితో కలిపి గోమాతకి ఆహారం కింద పెడితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కనుక మానసిక ప్రశాంతతను పొందాలంటే ఇలా ఆహారాన్ని గోమాతకి పెట్టండి, రాగి పిండిలో బెల్లం వేసి, కొంచెం నీళ్లు పోసి గోమాతకు పెడితే దరిద్రం పోతుంది. నానబెట్టిన పెసలు కూడా గోమాతకి పెట్టొచ్చు. అప్పుడు విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉడికించిన బంగాళదుంపల్ని గోమాతకు పెడితే నర ఘోష పోతుంది. మనం భోజనం చేసేటప్పుడు మొదట గోమాతకి పెట్టి లేదంటే కుక్కకి పెట్టి మనం తీసుకుంటే ఎన్నో చక్కటి ప్రయోజనాలు ఉంటాయి.