Soft Chapati : చాలా మంది ఈరోజుల్లో బరువు తగ్గాలని, ఆరోగ్యం బాగుండాలని రొట్టెలని తయారు చేసుకొని తింటున్నారు. అయితే రొట్టెలని చేసుకునేటప్పుడు కొన్ని తప్పుల వలన అవి మృదువుగా రావు. గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే అలా కాకుండా రొట్టెలు బాగా సాఫ్ట్ గా రావాలంటే ఇలా చేయండి. అప్పుడు బాగా మృదువుగా రొట్టెలు వస్తాయి. ముందు పిండిని బాగా కలుపుకోవాలి. ఇది చాలా ముఖ్యం.
ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా, కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీరు పిండిని కలిపేటప్పుడు కొంచెం పిండిని పక్కన పెట్టుకుంటూ స్లో గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన పిండి బాగా వస్తుంది. కొంచెం పిండి నీళ్లని పీల్చుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు పొడి పిండి కలుపుకుంటూ వెళితే సాఫ్ట్ గా వస్తుంది. ఆఖరున మొత్తం అంతా కలిపి కొంచెం నీళ్లతో తడిపి రెండు చేతులతో నెమ్మదిగా ప్రెస్ చేయండి.
ఈ పిండి బాగా సాఫ్ట్ గా అయిన తర్వాత మీరు మూత పెట్టండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని పిండి దాచుకోవాలని అనుకుంటే కొంచెం నూనెను మీరు పిండి ముద్ద మీద రాసి పెట్టండి. ఎప్పుడూ కూడా ఎయిర్ టైట్ కంటైనర్ లో పిండిని స్టోర్ చేసుకోవడం మంచిది. అలా చేయకపోతే మీరు అల్యూమినియం ఫాయిల్ ని ఉపయోగించవచ్చు.
అలాగే ఒక్కో సారి మనం రోటీలని కూడా నిల్వ ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటాము. కానీ అలా ఉంచితే అవి బాగా గట్టిగా మారిపోతాయి. రోటీలని అలా ఉంచినప్పుడు అవి గట్టిగా మారకుండా ఉండాలంటే ఆ రోటీల మీద కొంచెం నూనె ని కానీ లేదంటే కొంచెం నెయ్యి ని కానీ రాయండి. ఇలా కనుక మీరు రాశారంటే అవి పొడిగా అయిపోవు. తాజాగానే ఉంటాయి. అలాగే మెత్తగా, మృదువుగా ఉంటాయి.