ఆడాళ్లకు రెండిళ్లు ఉంటాయి. ఒకటి పుట్టినిల్లు రెండు మెట్టినిల్లు. పెళ్లయ్యేదాకా పుట్టింట్లో ఉంటుంది. వివాహమయ్యాక మెట్టినిల్లు. ఆడపిల్లకు మెట్టినింటి కంటే పుట్టింట్లోనే స్వాతంత్ర్యం ఎక్కువ. ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి. అమ్మానాన్న మీద ప్రేమ ఉంటుంది. వారికి కూడా కొడుకుకంటే కూతురంటేనే ఇష్టంగా ఉంటుంది. అందుకే ఆడపిల్ల ఏది అడిగినా కాదనరు. చిటికెలో కొనిస్తారు. వారు కూడా అన్నీ అడగరు. తమ ఇంట్లో ఏదైనా లేకపోతేనే అమ్మ నేను ఇది తీసుకెళ్తా అని అడుగుతారు. అదేం భాగ్యం తల్లి తీసుకో అంటూ ఉంటారు పుట్టింటి వారు. ఇలా ఆడపిల్లకు అత్తింటి వారికంటే పుట్టింటి వారితోనే అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం గారాల పట్టిగానే ఉంటుంది.
వాస్తు ప్రభావ రీత్యా ఇంటి ఆడపిల్ల కొన్ని రకాల వస్తువులు మాత్రమే తీసుకెళ్లొచ్చనే నిబంధనలు ఉన్నాయి. అన్ని రకాల వస్తువులు తీసుకెళ్లకూడదు. ఇక స్వీట్లు అయితే అందరు తినేవే. వాటిని నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. తమ అత్తగారింట్లో అందరి నోరు తీపి చేయడానికి తియ్యని వస్తువులు తీసుకెళ్లడంలో ఎలాంటి దోషాలు ఉండవు. వాటిని ఎప్పుడైనా తీసుకెళ్లి అత్తగారింట్లో అందరికి పంచొచ్చు. దీంతో వారిలో కూడా సంతోషాలు వెల్లివిరుస్తాయి. తమ కోడలు స్వీట్లు తెచ్చిందని అత్తగారు కూడా ఎంతో మురిసిపోతారు.
పుట్టింటి నుంచి ఆడవారు పూజా వస్తువులు తీసుకెళ్లకూడదు. ముఖ్యంగా మన ఇంట్లో వాడినవి అసలు ముట్టుకోకూడదు. దీపపు కుందులు కాని హారతి పళ్లెం కాని తాకకూడదు. ఎందుకంటే వాటిని పుట్టింటి నుంచి తీసుకెళితే ఆమెకు మంచిది కాదు. ఇటు పుట్టింటి వాళ్లకు కూడా నష్టమే. కావాలంటే వారి ఇంటి దగ్గరే కొత్తవి కొనుక్కోవాలి. కానీ పుట్టింటి నుంచి తీసుకెళ్లడం క్షేమం కాదు. కొంతమంది పెళ్లయినా ఇంటి దగ్గరే ఉండటంతో పుట్టింటి నుంచి ఏవేవో తీసుకెళ్తుంటారు. అలా చేయకూడదు. ఏం తీసుకెళ్లవచ్చో ఏం తీసుకెళ్ల కూడదో తెలుసుకుని మరీ తీసుకెళ్లడం మంచిది. లేదంటే రెండు కుటుంబాలకు అరిష్టమే కలుగుతుంది.
కాకరకాయ, మెంతి కూర వంటివి పుట్టింటి నుంచి అసలు తీసుకెళ్లరాదు. దీంతో ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిందే. పుట్టింటి నుంచి చాలా రకాల వస్తువులు తీసుకెళ్లడానికి వీలు లేదు. మనం కావాలని తీసుకెళ్లినా రెండు కుటుంబాలకు మంచిది కాదు. దీంతో మనం తీసుకెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. ఆడపడుచు పుట్టింటి వారి గౌరవం, మెట్టినింటి వారి ఖ్యాతిని నిలిపేందుకు రెండు కుటుంబాలకు మధ్య వారధిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉప్పు, చింతపండు, పాలు, పెరుగు, చీపురు తదితర వస్తువులను కూడా ఆడవారు తమ పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లకూడదు. తీసుకెళ్తే అన్నీ అనర్థాలే కలుగుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.