మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాన్ని బట్టి, ఏ దేవతా బలం ఉంటుందనేది చెప్పవచ్చు. మరి మీ నక్షత్రానికి కూడా ఏ దేవతా బలము ఉంటుందనేది చూసేయండి. అశ్విని నక్షత్రం కి కేతువు అధిపతి. ఆది దేవత గణపతి. భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి, ఆది దేవత మహాలక్ష్మి దేవి. కృతిక నక్షత్రానికి సూర్యుడు అధిపతి, ఆదిదేవత శివుడు. రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి, ఆది దేవత దుర్గాదేవి. మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి, ఆదిదేవత విష్ణువు.
ఆరుద్ర నక్షత్రానికి రాహువు అధిపతి, ఆదిదేవత సుబ్రహ్మణ్యస్వామి. పునర్వసు నక్షత్రానికి గురువు అధిపతి, ఆది దేవత దత్తాత్రేయ స్వామి. పుష్యమి నక్షత్రానికి శని అధిపతి, ఆదిదేవత శివుడు. ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి, ఆదిదేవత విష్ణువు. మఖ నక్షత్రానికి కేతువు అధిపతి, ఆదిదేవత గణపతి. పుబ్బ నక్షత్రానికి శుక్రుడు అధిపతి, ఆదిదేవత మహాలక్ష్మి.
ఉత్తర నక్షత్రానికి సూర్యుడు అధిపతి, ఆది దేవత శివుడు. హస్త నక్షత్రానికి చంద్రుడు అధిపతి, దుర్గాదేవి ఆది దేవత. చిత్త నక్షత్రానికి కుజుడు అధిపతి, ఆదిదేవత విష్ణువు. స్వాతి నక్షత్రానికి రాహువు అధిపతి, ఆదిదేవత సుబ్రమణ్య స్వామి. విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి, ఆదిదేవత దత్తాత్రేయ స్వామి. అనురాధ నక్షత్రానికి శని అధిపతి, ఆదిదేవత శివుడు. జేష్ట నక్షత్రానికి బుధుడు అధిపతి, ఆదిత్య విష్ణువు.
మూల నక్షత్రానికి కేతువు అధిపతి, ఆదిదేవత గణపతి. పూర్వాషాడ నక్షత్రానికి శుక్రుడు అధిపతి, ఆది దేవత మహాలక్ష్మి. ఉత్తరాషాడ నక్షత్రానికి సూర్యుడు అధిపతి, ఆదిదేవత శివుడు. శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి, దుర్గాదేవి ఆదిదేవత. ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి, ఆదిదేవత విష్ణువు. శతభిష నక్షత్రానికి రాహువు అధిపతి, ఆది దేవత సుబ్రహ్మణ్యస్వామి. పూర్వభద్ర నక్షత్రానికి గురువు అధిపతి, ఆదిదేవత దత్తాత్రేయ స్వామి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని అధిపతి, ఆదిదేవత శివుడు. రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి, ఆదిదేవత విష్ణువు. ఇలా నక్షత్రాలకి అధిపతి, ఆదిదేవత ఉంటాయి.