జగన్నాథుని రథయాత్ర మేళ తాళాలతో బయలు దేరే సమయంలో పూరీ చుట్టుపక్కల ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ రథయాత్ర ఒక సమాధి వద్ద ఆగుతుంది. ఇక్కడ మూడు రథాలు కాసేపు ఆగి, సమాధికి సమీపంలో ఉన్న ఆత్మలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాయని పండితులు చెబుతారు. ఇలా ఆగడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. పురాణాల ప్రకారం, జగన్నాథుడికి సల్బేగ్ అనే ఓ ముస్లిం భక్తుడు ఉండేవాడు. సల్బేగ్ తల్లి హిందువు, తన తండ్రి ముస్లిం. ఆయన ముస్లిం అయినందున జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి లేదా ప్రవేశించడానికి అనుమతించబడలేదు. అయితే సల్బేగ్ చూపిన భక్తికి జగన్నాథుడు చాలా సంతోషించాడు. ఓసారి జగన్నాథ రథయాత్ర వస్తున్న సమయంలో సల్బేగ్ మార్గం మధ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు సల్బేగ్ జగన్నాథుడిని ప్రార్థించాడు. ఒకసారి రథయాత్రలో పాల్గొనే అవకాశం ఇవ్వమని కోరాడు. ఆ తర్వాత ఓసారి సల్బేగ్ కుటీరం దగ్గర రథం ఆగిపోయిందని, అక్కడి నుంచి ముందుకు కదిలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆఖరికి సల్బేగ్ జగన్నాథుడిని పూజించిన తర్వాతే రథచక్రం ముందుకు కదిలింది. ఆ తర్వాత గుండిచా దగ్గరికి వెళ్తారు. గుండిచా ఆలయం జగన్నాథుని అత్తగారింటిగా పరిగణిస్తారు. ఇక్కడికి జగన్నాథుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రతో కలిసి రథయాత్రలో పాల్గొంటారు.
* పూరీ జగన్నాథుని రథయాత్ర కోసం అక్షయ తృతీయ రోజు నుంచే రథం తయారు చేసే పనులు ప్రారంభమవుతాయి. ఈ రథాల తయారీకి కొత్త వేప, కలప చెట్లను ఉపయోగిస్తారు. ఈ మూడు రథాల తయారీకి 884 చెట్లను వాడతారు. పూజారులు అడవికి వెళ్లి రథాన్ని నడిపేందుకు ఉపయోగించే చెట్లకు పూజలు చేస్తారు. పూజ అనంతరం బంగారు గొడ్డలితో చెట్లను నరికేస్తారు. ఈ గొడ్డలి మొదట జగన్నాథుని విగ్రహాన్ని తాకేలా తయారు చేస్తారు. బంగారు గొడ్డలితో చెట్లను కత్తిరించే పని మహారాణా ద్వారా జరుగుతుంది.
* జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన తర్వాత గండిచా ఆలయానికి చేరుకుంటారు. గండిచా ఆలయాన్ని గుండిచా బారి అని కూడా అంటారు. ఇక్కడే జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర దేవి ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. గుండిచా ఆలయంలో జగన్నాథుని దర్శనాన్ని ఆడప్ దర్శనం అంటారు. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రా దేవి విగ్రహాలను దేవుడైన విశ్వకర్మ ఇక్కడ నిర్మించాడని గుండిచా బారి గురించి చెబుతారు. గుండిచా జగన్నాథుని భక్తుడు. తన భక్తిని గౌరవిస్తూ భగవంతుడు ప్రతి ఏడాది స్వామి వారు ఇక్కడికి వస్తారని నమ్మకం.
* జగన్నాథ రథయాత్రలో మూడో రోజున వచ్చే పంచమి తిథికి ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున మాతా లక్ష్మి ఆలయం నుంచి బయలుదేరి పర్యటనకు వెళ్లిన జగన్నాథుడిని కలవడానికి వస్తుంది. అప్పుడు ద్వైతపతి తలుపు మూసేస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆగ్రహంతో రథచక్రాన్ని పగలగొడుతుంది. దీని తర్వాత ఆమె హేరా గోహిరి సాహి పూరి అనే ప్రాంతానికి వెళ్తుంది. అక్కడే లక్ష్మీదేవి ఆలయం ఉంది. తర్వాత జగన్నాథునిచే కోపంతో దేవతను శాంతింపజేసే సంప్రదాయం ఉంది.
* ఈ రథయాత్రలో కుల వివక్ష అనేదే ఉండదు. రథయాత్ర ముగింపు సందర్భంగా విగ్రహాలన్నీ జగన్నాథ ఆలయానికి చేరుకునే వరకు రథంలోనే ఉంటాయి. ఆషాఢ మాసం దశమి రోజున రథాలు ఆలయానికి బయలుదేరినప్పుడు, ఈ రథాల తిరుగు ప్రయాణాన్ని బహుద యాత్ర అంటారు. ఏకాదశి రోజున ఆలయ తలుపులు మూసేస్తారు. ఆ తర్వాత స్నానం చేయించిన తర్వాతే తిరిగి విగ్రహాలను ప్రతిష్టిస్తారు.