యాపిల్ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. యాపిల్ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు. మన శరీరానికి రోజూ అవసరం అయ్యే అనేక పోషకాలు యాపిల్ పండ్లలో ఉంటాయి.
యాపిల్ పండ్లు ఈ సీజన్లో చాలా చవక ధరలకు లభిస్తుంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వీటిని తినాలి. యాపిల్ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం బాగా తయారవుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
అయితే యాపిల్ పండ్లను కట్ చేసి తినే విషయంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు. కానీ వాటిని కింద ఇచ్చిన చిత్రంలో చూపిన విధంగా కట్ చేసి తినాలి. దీంతో మధ్యలో ఉండే కాండంతో కూడిన భాగం మొత్తం విడిపోతుంది. ఈ క్రమంలో విత్తనాలు రాకుండా సులభంగా యాపిల్ పండ్ల ముక్కలను తినవచ్చు.
యాపిల్ పండును పైన ఉన్న చిత్రాల్లో ఇచ్చిన విధంగా 9 ముక్కలు కోయాలి. అన్నింటి కన్నా మధ్యలో ఉండే భాగంలో విత్తనాలు, కాండం ఉంటాయి. కనుక ఆ భాగం ఒక్కటి తీసేయాలి. దీంతో విత్తనాలు పోతాయి. ముక్కలను సులభంగా తినవచ్చు.