Nagarjuna : యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా.. సౌందర్య, రమ్యకృష్ణలు హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. హలో బ్రదర్. ఈవీవీ సత్యనారాయణ దీనికి దర్శకత్వం వహించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు. వీరిద్దరూ కలిసి సంగీతం అందించిన చివరి మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. కథా బలం ఉన్న సినిమా కావడం.. దీనికి ఈవీవీ మార్కు కామెడీ తోడవడంతో ఈ సినిమా బంపర్ హిట్ అయింది.
అయితే ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించారు. ఒక పాత్ర పూర్తిగా ఊరమాస్ కాగా రెండో పాత్ర చాలా సాఫ్ట్ అయినది. ఈ మూవీలో నాగార్జున డ్యుయల్ రోల్‌లో ఫుల్ లెంగ్త్‌లో కనిపిస్తారు. అయితే ఇద్దరినీ చూపించాల్సిన వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా డూప్‌ను వాడాల్సిందే. అప్పట్లో ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేదు. కనుక డ్యుయల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్‌లో ఏ నటున్ని లేదా నటిని అయినా చూపించాలంటే అది మేకర్స్‌కు కత్తి మీద సామే అయ్యేది.
ఇక హలో బ్రదర్ సినిమాలో నాగార్జున రెండు క్యారెక్టర్లు ఒకేసారి తెరమీద కనిపించిన సమయంలో ఒక డూప్‌ను వాడారు. ఆయన ఎవరంటే.. నటుడు శ్రీకాంత్. అవును.. హలో బ్రదర్‌లో నాగార్జునకు శ్రీకాంత్ డూప్‌లా నటించారు. ఈ విషయాన్ని బిగ్‌బాస్ షోలో నాగార్జుననే స్వయంగా వెల్లడించారు. ఇక వీరిద్దరూ కలిసి ఈవీవీ సినిమా వారసుడులోనూ కనిపించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పర్సనాలిటీ నాగార్జునకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకనే హలో బ్రదర్‌లో నాగార్జునకు డూప్‌గా శ్రీకాంత్ నటించారు. ఇక నాగార్జున తన కెరీర్‌లో ఫుల్ లెంగ్త్ డ్యుయల్ రోల్ ఉన్న సినిమాలు 4 చేశారు. వాటిల్లో హలో బ్రదర్ ఒకటి. ఇది ఘన విజయం సాధించి అప్పట్లో నాగార్జునకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అలాగే ఈవీవీ, ఇతర నటీనటులకు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది.