మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒకటి. ఇది సూపర్ మార్కెట్లతోపాటు పండ్లను అమ్మే దుకాణదారుల వద్ద లభిస్తుంది. ఈ పండ్ల ధర తక్కువగానే ఉంటుంది. అందువల్ల వీటిని ఎవరైనా సరే కొనుగోలు చేసి తినవచ్చు. ఈ క్రమంలోనే స్టార్ ఫ్రూట్‌ను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్టార్ ఫ్రూట్‌లో అనేక విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, కాల్షియంలు అధికంగా ఉంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. చర్మం సురక్షితంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
2. అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఫ్రూట్ ఎంతగానో పనిచేస్తుంది. వీటిలో ఉండే అనేక బి విటమిన్లు, ఫైబర్ బరువును తగ్గించేందుకు సహాయ పడతాయి. జీర్ణాశయంలో ఉండే అల్సర్లను నయం చేస్తాయి.
3. స్టార్ ఫ్రూట్‌లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల హైబీపీ తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లను రాకుండా నివారించవచ్చు.
4. స్టార్ ఫ్రూట్‌లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
5. ఈ పండ్లలో అనేక వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే వాపులు తగ్గుతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
6. స్టార్ ఫ్రూట్‌లో బీటా కెరోటీన్ అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా చూస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.