భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే అనేక రకాల మసాలా దినుసులను నిత్యం ఆహారాల్లో వాడుతున్నారు. పచ్చి మిరపకాయలను కూడా కూరల్లో రోజూ వేస్తూనే ఉంటారు. కొందరు ఎండుకారం అంటే ఇష్టపడతారు. అయితే పచ్చి మిరపకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మెటబాలిజంను పెంచడంతోపాటు అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాప్సెయిసిన్, ఐరన్, విటమిన్ సి, ఎ, ఐరన్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పచ్చి మిరపకాయలను తినడం వల్ల శరీర మెటబాలిజం 50 శాతం వరకు పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బరువు తగ్గే ప్రక్రియ మొదలవుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అందువల్ల పచ్చి మిరపకాయలను రోజూ తినమని చెబుతున్నారు.
రోజుకు కనీసం 12 నుంచి 15 గ్రాముల మేర పచ్చి మిరపకాయలను తింటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
అయితే పచ్చి మిరపకాయలను తినడం వల్ల షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయని అంటున్నారు. అందువల్ల పచ్చి మిరపకాయలను తినాలని సూచిస్తున్నారు.
అయితే అసిడిటీ సమస్య ఉన్నవారు వీటిని తినరాదు. తింటే సమస్య మరింత ఎక్కువవుతుంది. మిగిలిన ఎవరైనా సరే వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు.