NTR Krishna ANR : ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ప్రముఖుల కృషి వలన ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్‌కి వచ్చింది . విక్టరీ వెంకటేశ్ తండ్రి నిర్మాత డి రామానాయడు, దర్శక రత్న దాసరి రావు ఇండస్ట్రీకి కొత్త రూపం తీసుకొచ్చారు. అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణ కుటుంబం పద్మాలయ స్టూడియోస్‌ను ప్రారంభించగా, అనంతరం చాలా ప్రొడక్షన్ హౌస్‌లు కూడా వచ్చాయి. అయితే వారు అప్పటి హీరోలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అప్పట్లో ఎన్టీఆర్ సినిమా అంటే సినిమా 50 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. కమర్షియల్ గా చాలా హంగులు అద్దాల్సి ఉండేదట. ప్రతి సినిమాకు కూడా 12 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట ఎన్టీఆర్. అప్పట్లో ఇది సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషనట. ఇక నాగేశ్వరరావు సినిమాకు 30 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. ఆ రోజుల్లో పది లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారట ఏఎన్ఆర్. కృష్ణసినిమాలకు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు బడ్జెట్ అయ్యేదట. అలాగే ప్రతి సినిమాకు ఏడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట కృష్ణ.
కృష్ణ సినిమాలతో సమానంగానే శోభన్ బాబు సినిమా బడ్జెట్ కూడా ఉండేదట. ఈయన కూడా ఆరు నుంచి ఏడు లక్షల వరకు బడ్జెట్ ను రెమ్యూనరేషన్ తీసుకునేవారట. సుమన్ కూడా ఆ రోజుల్లో మూడు లక్షల వరకూ రెమ్యూనరేషన్ తీసుకునే వారట. మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడే ఎదుగుతున్న నేపథ్యంలో ఆయన సినిమాకు 17 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. అలాగే ఒక్కో సినిమాకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారట. అలాగే పసివాడి ప్రాణం సినిమా తరువాత చిరంజీవి రెమ్యూనరేషన్ పూర్తిగా పెంచేసాడు. అలాగే బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలు వారి వారి క్రేజ్ ను బట్టి తమ రెమ్యునరేషన్ తీసుకున్నారు.