Keerth Suresh : మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న కీర్తి సురేష్ మరి కొద్ది రోజులలో ఓ ఇంటి కోడలు అవుతుంది. అందాల భామ కీర్తి సురేష్ పెళ్లికూతురు కాబోతుంది. ఆంథోనీ అట్చి ను డిసెంబర్ 12న గోవాలో వివాహం చేసుకోబోతుంది. ఈ పెళ్లివేడుకకు కొద్దిమంది అతిథులు, సన్నిహిత కుటుంబం, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తుంది. కీర్తి పెళ్లికి సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రం కూడా ఇప్పటికే బయటకు వచ్చింది. వివాహం వ్యక్తిగత వేడుకగా జరుగుతుందని, అందరి ప్రార్థనలు, ఆశీస్సులు ఉండాలని పత్రికలో పేర్కొన్నారు.
కీర్తి సురేష్ తన పెళ్లి విషయంలో సమంతని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సమంత, చైతన్య వివాహం కూడా గోవాలోనే జరిగింది. ఇక అప్పుడు సమంత, చైతన్య ఇద్దరూ మొదట హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోగా, తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. కీర్తి సురేష్, ఆంటోని పెళ్లి కూడా అదే విధంగా జరగబోతోంది. డిసెంబర్ 10 వ తేదీన హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలు మొదలవుతాయి. ఆ తర్వత సంగీత్, రెండు రోజల పెళ్లి జరగనుందని టాక్. మరి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తుందా లేదా అనేది ఇప్పుడే తెలియదు. కీర్తి సురేష్.. మేనకా సురేష్, సురేష్ కుమార్ దంపతుల సంతానం కాగా, మేనకా సురేష్ అప్పట్లో నటిగా రాణించారు. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పున్నమినాగులో హీరోయిన్ గా నటించింది మేనకనే.
ఇక ఇంజనీర్ అయిన ఆంథోనీ ఇప్పుడు పూర్తి స్థాయి వ్యాపారవేత్త అయ్యాడు. అతనికి కేరళలో ఆస్పెరోస్ విండోస్ సొల్యూషన్స్ ఉంది. ప్రస్తుతం అతను దుబాయ్‌లో ఉంటున్నట్టు తెలుస్తుంది. మరి పెళ్లి తర్వాత కీర్తి సురేష్ అతనితో దుబాయ్‌కి వెళుతుందా, ఇక్కడే ఉండి సినిమాలు చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక పెళ్లి వేడుకలో కీర్తి హిందూ తమిళ బ్రాహ్మణ స్టైల్ డ్రెస్‌లో కనిపించనుందని సమాచారం. అతిథులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉండనుంది. సాయంత్రం మరో ఫంక్షన్ కూడా ఉండనుంది. ఇక రాత్రి క్యాసినో నైట్ పార్టీతో వివాహ వేడుకలు ముగుస్తాయి.