Sarkaru Vaari Paata : యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. డిఫరెంట్ కథాంశంతో దర్శకుడు పరశురామ్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటాయి. యువత, సోలో, ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి లవ్ అండ్ యాక్షన్ కథాంశాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు డైరెక్టర్ పరుశురాం. ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. గీత గోవిందం సక్సెస్ తో పరశురామ్ క్రేజ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. స్టార్ హీరోలు కూడా ఆయన చిత్రాల్లో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
గీత గోవిందం చిత్రం తర్వాత పరుశురాం డైరెక్షన్ లో స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సర్కారు వారి పాట చిత్రానికి ఫస్టాఫ్ అదుర్స్, సెకండాఫ్ వేస్ట్ అంటూ టాక్ వినిపించినా, వచ్చిన కామెంట్స్ అన్నింటిని పక్కకు నెట్టివేస్తూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ సంస్థల వారికి దాదాపు రూ.190 కోట్లను కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు కనకవర్షం కురిపించింది.
ఇంత ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి డైరెక్టర్ పరుశురామ్ మొదటిగా అల్లు అర్జున్ హీరోగా అనుకున్నారట. కానీ అల్లుఅర్జున్ అప్పటికే పుష్ప సినిమాకి ఓకే చెప్పడంతో ఈ కథ కాస్త మహేష్ బాబు చెంతకు చేరింది. పుష్ప చిత్రం పాన్ ఇండియా చిత్రం కావడంతో అల్లు అర్జున్ పుష్పలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో ఫుల్ గ్లామరస్ రోల్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తమన్ అందించిన మ్యూజిక్ సినిమా రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని దక్కించుకుంది.