Annatto Seeds : ఉప్పు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకనే, ఆరోగ్య నిపుణులు కూడా ఉప్పుని బాగా తగ్గించమని చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా, ఉప్పుని అధిక మోతాదులో తీసుకోకూడదు. ఎక్కువగా ఉప్పును తీసుకుంటే, చాలా రకాల సమస్యలు వస్తాయని గుర్తు పెట్టుకోండి. అయితే, కేవలం ఉప్పులోనే కాదు. అన్ని ఆహార పదార్థాలు కూడా ఉప్పు ఉంటుంది. సోడియం లేని ఆహారం అయితే లేదు. ఒంట్లో సోడియం తగ్గడం మంచిది కాదు. సోడియం లోపం ఉండకూడదు. సోడియం ఎప్పుడు కూడా, 135 కంటే ఎక్కువ ఉండాలి.
125 నుండి 128 యూనిట్ల వరకు, సోడియం ఉంటే, పెద్దగా సమస్య ఏమి కూడా ఉండదు. సోడియం ఎక్కువగా ఉండే, ఆహార పదార్థాల గురించి చూద్దాం. ఆన్నాట్టో సీడ్స్ లో సోడియం ఎక్కువ ఉంటుంది. ఈ సీడ్స్ లో 2240 మిల్లీగ్రాములు సోడియం, 100 గ్రాముల గింజల్లో ఉంటుంది. మామూలుగా మనకి కూరలులో అలానే పండ్లలో, 25 మిల్లీగ్రాముల నుండి 80 మిల్లి గ్రామాల వరకు సోడియం ఉంటుంది.
కర్బూజా పండ్లలో ఎక్కువ సోడియం ఉంటుంది. 100 గ్రాముల కర్బూజా పండ్లలో, 105 గ్రాముల సోడియం ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీళ్లలో, 105 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. తోటకూరలో చూసుకున్నట్లయితే, 200 ఉంటుంది. పాలకూరలో క్లోరైడ్ ఉండడం వలన, సాల్ట్ ఎక్కువ ఉందని అనుకుంటారు. కానీ, తోటకూరలో ఎక్కువగా సోడియం ఉంటుంది. ఆన్నాట్టో సీడ్స్ ని తీసుకోవచ్చు. అన్నాటో సీట్స్ ని సహజమైన రంగు కోసం వాడతారు.
నాచురల్ కలర్ గా, దీనిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఆన్నాట్టో సీడ్స్ ని పొడి తీసుకొని, మనం వాడుకోవచ్చు. అలానే ఈ పేస్ట్ ని కూడా వాడుకోవచ్చు. ఈ గింజల పొడిలో ఉండే ఫైబర్, జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు ఉండవు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.