Kitchen Items : వంటగదిలో వాస్తు ప్రకారం కొన్ని పదార్థాలని అస్సలు ఎప్పుడూ కూడా వుండేలానే చూసుకోవాలి. ఈ పదార్థాలు నిత్యం వంటగదిలోనే ఉండాలి. వాటిని తొలగించకండి. ఖాళీ అయిపోయే దాకా అసలు ఉంచకండి. ఒకవేళ పూర్తిగా అయిపోతే, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి పైన కూడా అది ప్రభావం చూపిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వంటగదిలో ఎటువంటి వస్తువులు అవసరమవుతాయనేది ఈరోజు తెలుసుకుని, ఆ తప్పులను చేయకుండా చూసుకోండి.
పసుపు కి ఉన్న ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వాస్తు శాస్త్రంలో కానీ ఆధ్యాత్మికపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ పసుపు చాలా ముఖ్యమైనది. బృహస్పతి గ్రహానికి సంబంధించినది పసుపు. అటువంటి సందర్భంలో పసుపు ఎల్లప్పుడూ ఇంట్లో ఉండాలి. ఒకవేళ కనుక పసుపు అయిపోయింది అంటే, బృహస్పతి గ్రహం యొక్క దోషం వస్తుంది. దీని కారణంగా అన్ని పనులకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి పూర్తిగా అయిపోయే వరకు ఆగకండి. ముందే తెచ్చి పెట్టుకోండి.
బియ్యం కూడా ఎప్పుడూ ఇంట్లో అయిపోకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం శుక్ర గ్రహానికి సంబంధించినది. వంట గదిలో బియ్యం అయిపోతే శుక్రుడు కారణమని నమ్ముతారు. దీని కారణంగా డబ్బు సమస్యలు వస్తాయి. ఉప్పు కూడా అయిపోయే వరకు ఎదురు చూడకూడదు. ఉప్పు ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. దోషాలని లేకుండా చేస్తుంది. వంటింట్లో ఉప్పు ఎప్పుడు ఉండాలి.
గోధుమ పిండి కూడా ఉండాలి. ఆర్థిక పరిస్థితికి సంబంధించినది గోధుమపిండి. ఇది అయిపోతే పనికి అంతరాయం కలగొచ్చు. చికాకులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వీటిని ఎప్పుడు ఇంట్లోనే ఉంచండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సమస్యలు ఉండవు. సంతోషంగా జీవించవచ్చు.