భూమ్మీద పుట్టిన మనుషులందరి వ్యక్తిత్వాలు ఒకే రకంగా ఉండవు. వేర్వేరుగా ఉంటాయి. అదే విధంగా ఒక్కో మనిషికి ఉండే రుచులు, ఇష్టాలు, అభిప్రాయాలు కూడా మారుతాయి. అయితే ఒక మనిషికి ఉండే బాడీ లాంగ్వేజ్ కూడా ఇదే కోవకు వస్తుంది. ఏ ఇద్దరు మనుషులను తీసుకున్నా వారి బాడీ లాంగ్వేజ్ ఒక్కటిగా ఉండదు. కానీ విజయవంతంగా ముందుకు దూసుకువెళ్లే వారికి మాత్రం ప్రత్యేకంగా ఓ బాడీ లాంగ్వేజ్ ఉంటుందట. అవును మీరు విన్నది నిజమే. కొన్ని ప్రత్యేకమైన హావభావాలు, లక్షణ, ప్రవర్తన, మాట్లాడే విధానం వంటివి వారికి వేరేగా ఉంటాయి. మరి అవేమిటో, ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. నిటారుగా కూర్చోవడం
ఆఫీస్‌లో టేబుల్ మీదకు ఒరిగిపోవడం, డెస్క్‌పై మోచేతులు పెట్టి కూర్చోవడం, చేతులతో ముఖాన్ని కవర్ చేయడం వంటివి అగౌరవ పనుల కిందకు వస్తాయి. అలా కాకుండా కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. వాలిపోకూడదు. ముందుకు వంగకూడదు. నిటారుగా కూర్చుంటేనే దాన్ని పవర్ పొజిషన్ అంటారు. అలా కూర్చుంటేనే ఎవరైనా సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ముందుకు దూసుకెళ్తారట.
2. సైగలు
అతి శయోక్తిని కలిగించేలా ఎవరూ సైగలు, సంజ్ఞలు చేయకూడదు. అవి అత్యంత సాధారణంగా ఉండాలి. అలా ఉంటేనే ఇతరులకు ఓపెన్ మైండెడ్ వ్యక్తిలా కనిపిస్తారు. ఇది విజయవంతమైన వారికి ఉండే బాడీ లాంగ్వేజ్‌లో ఒకటి. దీన్ని ఎవరైనా ఆపాదించుకుంటే సక్సెస్‌ను పొందవచ్చు.
3. క్రాస్ హ్యాండ్స్
చేతులు కట్టుకుని ఉండడం, కాలు మీద కాలేసుకుని కూర్చోవడం సరైన బాడీ లాంగ్వేజ్ కాదు. కాళ్లు, చేతులను ఎల్లప్పుడూ ఓపెన్‌గా ఉండేలా పెట్టాలి. అదే సక్సెస్‌కు దారిలాంటిదట. ఎవరైనా ఇదే పద్ధితిని ఫాలో అవ్వాలి. అప్పుడు సక్సెస్ దరి చేరుతుంది.
4. జుట్టు
చాలా మంది ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు లేదంటే మిగతా సమయాల్లో కూడా జుట్టుతో ఆటాడుతుంటారు. కానీ అలా చేయకూడదు. అది ఎదుటి వారికి పూర్తిగా ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. మంచి బాడీ లాంగ్వేజ్ కూడా కాదు. కనుక ఈ అలవాటును మానుకోవాలి.
5. నవ్వు
ఎప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో నవ్వాలో అప్పుడే డీసెంట్‌గా నవ్వాలి. అంతే కానీ పదే పదే పనికి రాని విషయాలకు కూడా నవ్వకూడదు. అది సరైన బాడీ లాంగ్వేజ్ కాదు. సక్సెస్ పొందిన వారికి అసలు ఈ బాడీ లాంగ్వేజ్ ఉండదట. కనుక ఎవరైనా సక్సెస్ పొందాలంటే ఈ అలవాటును మానుకోవాలి.
6. తదేక దృష్టి
కొందరు ఎదుటి వారి కళ్లలోకి అదే పనిగా చూస్తూ మాట్లాడతారు. ఇంకొందరు అసలు కళ్లలోకి కళ్లు పెట్టి చూడరు. ఎటో చూస్తూ మాట్లాడుతారు. అయితే ఈ రెండు బాడీ లాంగ్వేజ్‌లు కరెక్ట్ కాదు. అవసరం ఉన్న సమయంలో కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలి. వద్దు అనుకుంటే చూడకుండా మాట్లాడాలి. ఇదే సరైన బాడీ లాంగ్వేజ్. కనుక దీన్ని అలవాటు చేసుకుంటే మంచిది.
7. హ్యాండ్ షేక్
ఇతరులను కలిసినప్పుడు మొహమాట పడుతూ లేదంటే ఇష్టం లేకుండా ఏదో చేయి కలపాలి అంటే కలపాలి అనే నిరాసక్తతో హ్యాండ్ షేక్ ఇవ్వవద్దు. హ్యాండ్ షేక్ ఇస్తే పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. అదే కచ్చితమైన, కరెక్ట్ అయిన బాడీ లాంగ్వేజ్‌కు గుర్తు. విజయవంతమైన వ్యక్తులు ఇలాగే చేస్తారట. కనుక ఇలాంటి పర్‌ఫెక్ట్ హ్యాండ్ షేక్ ఇవ్వడాన్ని అలవాటు చేసుకోవాలి.