సంచలన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నటించిన అందరికీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రభాస్, రానా నేషనల్ స్టార్స్ అయ్యారు. వారి మార్కెట్ కూడా పెరిగింది. అయితే బాహుబలి మూవీ గురించి ఎన్ని విషయాలను తెలుసుకుంటున్నా ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాలు అందులో ఉంటూనే ఉన్నాయి. ఏదో ఒక విషయం గురించి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అలాంటిదే మరొక విషయం గురించి తెలుసుకుందాం.
బాహుబలి మూవీలో యుద్ధం సీన్ల సమయంలో చిత్రంలో ఇచ్చిన పరికరాన్ని మీరు చూసే ఉంటారు. శత్రువుల మీదకు భారీ గుండ్లను వదిలేందుకు దీన్ని వాడతారు. అయితే దీని గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని కాటాపుల్ట్ (catapult) అంటారు. అప్పటి వరకు కత్తులు కటార్లతోనే సాగుతున్న యుద్ధం వీటి రాకతో కొత్త టర్న్ తీసుకుందనే చెప్పాలి. ఈ యుద్ధ పరికరం సహాయంతోనే మగధ రాజైన అజాతశత్రు లిచ్చావీ రాజ్యాన్ని సునాయాసంగా ఓడగొట్టాడు. అప్పటి వరకు పాశ్చాత్య దేశాలకే తెలిసిన ఈ కొత్త ఆయుధాన్ని మన దగ్గర ప్రవేశపెట్టాడు అజాతశత్రు.
పంగల కర్ర (ఉండేలు) కాన్సెప్ట్ తో తయారు చేసిన ఈ పరికరంలో మొదట తాడును, తర్వాత ఎలాస్టిక్ ను, తర్వాత స్ప్రింగ్స్ ను ఉపయోగించి పెద్ద పెద్ద బండరాళ్లను శత్రువుల పైకి విసిరేవారు. దీంతో శత్రు మూక చెల్లాచెదురయ్యేది. తర్వాత రాళ్లకు బదులు పేలుడు పదార్థాలు వాడారు. ఫిరంగుల రాకతో వీటి ఉపయోగం తగ్గిపోయింది. ఎంటర్టైన్మెంట్ కోసం కూడా వీటిని ఉపయోగించేవారు. దూరంగా వలను ఏర్పాటు చేసి ఇందులోనుండి మనిషిని వల లోకి విసిరేసేవారు. నీటి జలాశయాల్లోకి కూడా వీటిలో కూర్చున్న మనుషులను విసిరేసేవారు. మొదట్లో దూరం అంచనా సరిగ్గా లేక కొందరు చనిపోయారు కూడా. తరువాత దీన్ని అలా ఉపయోగించడం మానేశారు. ఇక చాలా రాజుల విజయాల్లో కీలకపాత్ర పోషించి ఈ పరికరం బాహుబలి సినిమా ద్వారా మరోసారి మనకు కనిపించింది.