Bed Room And Kitchen Vastu : చాలామంది, వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం ఫాలో అయితే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా, చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు. ప్రతి ఒక్కరు కూడా, జీవితంలో ముందుకు వెళ్లాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటుంటారు. ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలంటే, కొన్ని వాస్తు చిట్కాలని పాటించడం మంచిది. వాస్తు ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుంది. వంటగదిలో, బెడ్రూంలో కొన్ని తప్పులు చేయడం వలన, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వాస్తు ప్రకారం వంటగదిలో, బెడ్ రూమ్ లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం, వంటగది ఇంటికి ఆగ్నేయ వైపు ఉండాలి. వంట చేసేటప్పుడు తూర్పుదిక్కుకి ఎదురుగా తిరిగి వంట వండుకోవాలి. వంటగదిలో ఆహారాన్ని తినకూడదు. వంటగదిలో ఉపయోగించే బరువైన వస్తువులని వంటగదికి నైరుతి గోడ పై పెట్టాలి. ఎప్పుడూ కూడా, కిచెన్లో ఉండే సింక్ మురికి లేకుండా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. ఎప్పుడూ కూడా మురికి పాత్రలని అలా పెట్టేసి వదిలేయకూడదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి.
లేదంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇంట్లో వంటగది ఎప్పుడూ కూడా బాత్రూంకి ఎదురుగా ఉండకూడదు. వంటగది రంగు పసుపు లేదంటే తెలుపు రంగులో ఉండాలి. లైట్ కలర్స్ ని వాడితేనే మంచిది. ఇలా ఈ మార్పులు చేసుకుంటూ ఉండాలి.
ఇక బెడ్ రూమ్ విషయానికే వస్తే మంచం మీద కూర్చుని తినడం మంచిది కాదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మంచం మీద కూర్చుని అసలు కాఫీ, టీ వంటివి కూడా తీసుకోకూడదు. వాస్తు ప్రకారం దిండు కింద ఏమీ పెట్టుకోకూడదు. ఈ తప్పులు చేయకుండా చూసుకుంటే, చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.