Bank Accounts : ప్రతి ఒక్కరికి కూడా, బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. బ్యాంకులో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. బ్యాంకులో డబ్బులు దాచుకోవడం వలన, ఎన్నో లాభాలు ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పెట్టుకోవడం, పూర్తి సురక్షితం. బ్యాంకులో డబ్బులు పెట్టుకోవడం వలన మనకి ఏ సమస్య కూడా ఉండదు. పైగా, డబ్బులు బ్యాంకులో పెట్టడం వలన వడ్డీతో పాటుగా మనకి ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే. ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ సందేహం మీకు కూడా ఉన్నట్లయితే, ఇప్పుడే క్లియర్ చేసుకోండి.
ఇటీవల కాలంలో, ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్ లు ఉండొచ్చనే అంశం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఖాతాల విషయంలో కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను అర్థం చేసుకోవడం, చాలా అవసరం. భారతదేశంలోని బ్యాంకులు పొదుపు ఖాతాలు, కరెంట్ అకౌంట్స్, జీతం ఖాతాలు అలానే ఉమ్మడి ఖాతాలతో సహా అనేక రకాల ఖాతా ఎంపికలు ఉన్నాయి. వీటిలో పొదుపు ఖాతా అనేది డబ్బుని కాపాడుకోవాలనుకునే వ్యక్తులకి, అత్యంత పేరు పొందిన విధానం. కస్టమర్లు తమ పొదుపు పై వడ్డీని పొందే అవకాశాన్ని బ్యాంకులు ఇస్తున్నాయి.
వ్యాపార ప్రయోజనాల కోసం, వ్యక్తులు కరెంట్ ఖాతాని ఎంచుకుంటారు. కరెంట్ ఖాతా లో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. అలానే, చాలామంది ఉమ్మడి ఖాతాలని కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలు ఉండాలని. దానిమీద ఎటువంటి పరిమితి కూడా లేదు. అధికారిక నిబంధనలను ఉల్లంఘించకుండా, బహుళ బ్యాంక్ ఖాతాలని కలిగి ఉండొచ్చు.
మూడు కంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఎన్ని ఖాతాలు కలిగి ఉండొచ్చు అని సంఖ్యని మాత్రం ప్రభుత్వం ఏమీ ప్రకటించలేదు. కఠినమైన నిబంధనలను కూడా విధించలేదు. కాబట్టి, జాగ్రత్తగా ఇబ్బందులు ఏమీ లేకుండా చూసుకుంటే సరిపోతుంది.