Bell In Temple : ఆలయానికి వెళ్లిన తరువాత ముందుగా మనం చేసే పని గంటను మ్రోగించడం. ఇది మన ఆచారం కూడా. వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయంలో గంటను మ్రోగించడం వల్ల మనలో సానుకూలతను పెంచుతుంది. అయితే కొందరు ఆలయం నుండి ఇంటికి వెళ్లే సమయంలో కూడా గంటను మ్రోగిస్తూ ఉంటారు. గంట కొట్టి ఇంటికి వెళ్తూ ఉంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. అసలు గుడి నుండి ఇంటికి వెళ్లేటప్పుడు గంటను ఎందుకు మ్రోగించకూడదు.. పండితులు దీని గురించి ఏం చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం గుడి నుండి ఇంటికి వెళ్లేటప్పుడు గంటను మ్రోగించడం తప్పుగా పరిగణించబడుతుంది. సాధారణంగా మనం ఆలయంలోకి ప్రవేశించిన తరువాత గంటను మ్రోగించి ఆ తరువాతే దైవదర్శనాన్ని చేసుకుంటూ ఉంటాము. ఈ ఆచారం ఏ నాటిదో. ఇప్పటికి దీనిని మనం పాటిస్తూనే ఉన్నాం.
ఆలయంలో గంటను కొట్టడం వెనుక అనేక ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి. ధ్వని శక్తికి సంబంధించింది. కనుక ధ్వని శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఆలయంలో గంటను మోగించినప్పుడల్లా గంట మోగించేవారికి మరియు చుట్టూ ఉన్న వారికి సానుకూల శక్తి ప్రసారమవుతుంది. అలాగే స్కంద పురాణంలో ఆలయంలో గంటను మోగించేటప్పుడు వచ్చే ధ్వని ఓం ని పోలి ఉంటుందని పేర్కొన్నారు. ఓం శబ్దం చాలా స్వచ్చమైన, సానుకూల శక్తిని కలిగి ఉంటుంది. అలాగే గుడిలో గంటను మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు వస్తాయి. దీంతో చుట్టుప్రక్కల గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, క్రిములు నశిస్తాయి. ఈ విధంగా గంటను మోగించడంలో శాస్త్రీయ అంశం కూడా ఉంది.
కనుకనే మన పెద్దలు గుడిలోకి ప్రవేశించిన తరువాత గంటను మోగించే ఆచారాన్ని పెట్టారు. అయితే గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు గంటను మోగించకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా గుడి నుండి బయటకు వెళ్లేటప్పుడు గంటను మోగించడం వల్ల మనలో ఉండే సానుకూల శక్తి అక్కడే వదిలేయబడుతుంది. కనుక గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు గంటను మోగించకూడదు.