Body Detox : నేటి తరుణంలో మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది జంక్ ఫుడ్ ను, ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాగే పార్టీలకు, ఫంక్షన్ లకు వెళ్లినప్పుడు, ట్రిప్స్ వంటి వాటికి వెళ్లినప్పుడు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఇలా జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఆమ్లత్వం పెరగడం శరీరానికి మంచిది కాదు. శరీరంలో ఆమ్లత్వం తక్కువగా, క్షారత్వం ఎక్కువగా ఉండాలి. ఆమ్లత్వం ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో రక్తం, కణాలల్లో కూడా ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఆమ్లత్వం పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఆమ్లత్వం పెరగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
హార్మోన్లల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. అలాగే జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలోకి కలర్స్, ఫ్రిజర్వేటివ్స్, కెమికల్స్, పెర్టిలైజర్స్ ఎక్కువగా చేరుతాయి. కనుక శరీరంలో చేరిన ఈ వ్యర్థాలను తొలగించడానికి, శరీరంలో పెరిగిన ఆమ్లత్వాన్ని తగ్గించడం చాలా అవసరం. శరీరంలో ఆమ్లత్వం తగ్గాలంటే శరీరానికి డిటాక్సిఫికేషన్ చేయడం చాలా అవసరం. ఇలా జంక్ ఫుడ్ ను తీసుకున్న మరుసటి రోజూ ఉదయం నీటిని తాగి రెండు సార్లు మలవిసర్జన అయ్యేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రేగుల్లలో ఆహారం నిల్వ లేకుండా ఉంటుంది. ప్రేగులు శుభ్రపడతాయి. ఒకవేళ మలవిసర్జన సరిగ్గా జరగకపోతే ఎనిమా చేసుకుని అయినా ప్రేగులు శుభ్రపడేలా చూసుకోవాలి. అలాగే ఎటువంటి ఆహారం తీసుకోకుండా మధ్యాహ్నం వరకు నీటిని తాగుతూనే ఉండాలి. మధ్యాహ్నం ఒక గ్లాస్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ను తీసుకోవాలి.ఈ జ్యూస్ రుచిగా ఉండాలనుకునే వారు ఇందులో తేనె, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి తీసుకోవచ్చు. 300 నుండి 350 ఎమ్ ఎల్ వరకు దీనిని తీసుకోవచ్చు. ఒకవేళ బూడిద గుమ్మడి జ్యూస్ తాగలేని వారు కీర, టమాట, సొరకాయ, క్యారెట్ లను ముక్కలుగా చేసి వీటితో జ్యూస్ చేసుకుని తేనె కలిపి తీసుకోవచ్చు.
ఇలా జ్యూస్ లను తాగడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ చక్కగా జరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో దానిమ్మ జ్యూస్ ను తీసుకోవాలి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ను ప్రోత్సహించడంలో దానిమ్మ జ్యూస్ మనకు ఎంతో సహాయపడుతుంది. అలాగే సాయంత్రం 7 గంటల లోపు నారింజ జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా రోజులో మూడు పూటలా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా మూడు జ్యూస్ లను తాగి ఉండాలి. ఈ జ్యూస్ లన్నీ కూడా ఆల్కలైన్ ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ జ్యూస్ లను తాగడం వల్ల శరీరంలో ఆమ్లత్వం తగ్గుతుంది. జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలోకి ప్రవేశించిన వ్యర్థాలు, రసాయనాలన్నీ కూడా బయటకు పోతాయి. ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో ఆమ్లత్వం తగ్గడంతో పాటు వ్యర్థాలు కూడా చాలా సులభంగా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్ ను, ఫాస్ట్ ఫుడ్ ను తీసుకున్న తరువాత మరుసటి రోజు ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.