Business Idea : ప్రస్తుత తరుణంలో దోశ సెంటర్ బిజినెస్ ఎలా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. చాలా చోట్ల రహదారుల పక్కన మొబైల్ దోశ సెంటర్ పెట్టి చాలా మంది రక రకాల దోశలను వేస్తూ లాభాలు గడిస్తున్నారు. అయితే దోశ సెంటర్ పెట్టాలంటే దోశ వేసే మాస్టర్లు కావాలి. ఈ క్రమంలో వారికి ఎక్కువ వేతనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వారు లేకుండా మనకు మనమే సొంతంగా దోశలు వేసుకుందామంటే.. మనకు అంతగా ప్రావీణ్యత ఉండదు. అందుకనే చాలా మంది ఈ బిజినెస్ పెట్టేందుకు వెనుకాడుతుంటారు. అయితే దోశ మేకింగ్ మెషిన్ కొనుగోలు చేస్తే.. దోశ వేయడం రాకపోయినా ఫర్వాలేదు.. ఎంచక్కా ఆ బిజినెస్‌ను సులభంగా రన్ చేయవచ్చు. మరి ఈ బిజినెస్‌లో ఎంత వరకు పెట్టుబడి అవసరం అవుతుంది..? ఎంత వరకు సంపాదించవచ్చు..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
దోశ మేకింగ్ మెషిన్‌ను మార్కెట్‌లో రూ.1.50 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇక మొబైల్ దోశ సెంటర్ పెట్టాలంటే వాహనం ఉండాలి. అలా కాకుండా షటర్లను రెంట్‌కు తీసుకుని కూడా దోశ సెంటర్ పెట్టవచ్చు. ఎక్కడ పెట్టినా ఈ బిజినెస్ ను జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో నిర్వహిస్తే లాభాలు గడించవచ్చు. ఇక దోశ మేకింగ్ మెషిన్‌లో ప్రక్రియ అంతా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. అందులో పిండి, వేసే దోశను బట్టి అందుకు కావల్సిన ఆహార పదార్థాలు, నూనె తదితరాలను మెషిన్‌లోని బాక్సుల్లో ఉంచాలి. తరువాత బటన్లను ప్రెస్ చేస్తూ ఆపరేట్ చేస్తే.. దోశలు ఆటోమేటిగ్గా తయారై, మడతబెట్టబడి బయటకు వస్తాయి.
అయితే దోశ ఎంత సైజ్‌లో ఉండాలి, ఎంత మందం ఉండాలి, ఎంత రోస్ట్ అవ్వాలనే వివరాలను కూడా మెషిన్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మెషిన్ సహాయంతో రక రకాల దోశలను వేయవచ్చు. కస్టమర్ల అభిరుచి మేరకు దోశలను వేసి ఇచ్చి ఆ మేర ఆదాయం పొందవచ్చు. ఇక ప్రస్తుతం ఒక సాధారణ దోశకు దాదాపుగా రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. అదే పలు పదార్థాలు కలిసిన స్పెషల్ దోశ అయితే.. ఆయా పదార్థాలను బట్టి రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క దోశకు యావరేజ్‌గా రూ.60 వస్తుందని అనుకున్నా.. దోశ మేకింగ్ మెషిన్ ద్వారా రోజుకు 500 దోశలు వేస్తే.. 500 * 60 = రూ.30,000 వస్తాయి. అందులో కనీసం 40 శాతం ఖర్చులను తీసేసినా.. 60 శాతం లాభం ఉంటుంది. అంటే రూ.30వేలలో 40 శాతం ఖర్చులు రూ.12వేలు తీసేస్తే.. రూ.18వేలు అవుతుంది. అయితే ఆ మొత్తం కాకపోయినా నిత్యం రూ.10వేలు లాభం వచ్చినా చాలు.. నెలకు రూ.3 లక్షలు సంపాదించవచ్చు.
ఇక దోశ సెంటర్‌ను షటర్లలో పెట్టాలనుకుంటే.. లోకల్ అథారిటీ పర్మిషన్, ఫుడ్ అధికారుల అనుమతి తదితర పత్రాలు పొందాలి. అయితే షటర్లలో లేదా వాహనంలో ఎక్కడైనా సరే.. దోశ సెంటర్‌ను పెడితే.. చాలా పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించాలి. అలాగే చక్కని రుచి, నాణ్యత మెయింటెయిన్ చేయాలి. దీంతో కస్టమర్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుంది. ఇలా ఈ బిజినెస్‌లో నిరంతరం కొనసాగి.. చక్కని ఆదాయం పొందవచ్చు.