మనలో చాలా మంది సమయానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల కడుపు నిండినా శరీరానికి కావాల్సిన పోషకాలు మాత్రం అందవు. రక్తహీనత వల్ల కంటి సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనత బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు తినే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది.
అవిసె గింజలలో శరీరానికి అవసరమైన పీచు, ప్రోటీన్లతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అవిసె గింజలను తినడం వల్ల నీరసం, నిస్సత్తువ దరి చేరవు. అవిసె గింజల వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది. బచ్చలికూరను తినడం వల్ల కూడా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. బచ్చలికూరలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె1, బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ బి9, ఐరన్ లభిస్తాయి.
సోయాబీన్స్ తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఐరన్, మెగ్నీషియంతోపాటు క్యాల్షియం కూడా లభిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచే ఆహార పదార్థాలలో సొయాబీన్స్ కూడా ఒకటి. మొలకలను తినడం ద్వారా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పెసలు ఆరోగ్యానికి మంచివి. పెరుగు తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
రోజుల తరబడి పెరుగును ఫ్రిజ్ లో ఉంచితే పోషకాలు నశించే అవకాశం ఉంటుంది. పెరుగులో ఉండే కాల్షియం, బి12 ఎముకలను పటిష్టం చేయడంలో తోడ్పడతాయి. మెంతుల ద్వారా శరీరానికి అవసరమైన పీచు లభిస్తుంది. మెంతులలో ఉండే ఐరన్, విటమిన్ సి రక్తహీనత నుంచి సులువుగా బయట పడేస్తాయి.