Pushpa : అల్లు అర్జున్ తొలిసారి ఊరమాస్‌లో కనిపించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నట విన్యాసం అదిరిపోయింది. శ్రీవల్లిగా రష్మిక కూడా అలరించింది. మొదటి పార్ట్ కు రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో రూ.102 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మొదటి 9 రోజుల్లో ఈ సినిమాకు రూ.123 కోట్ల షేర్ వచ్చింది.
ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా ప్రదర్శింపబడుతుండగా, ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. మొదటి పార్ట్ క్లైమాక్స్‌లో విలన్ ఫహద్ ఫాజిల్, అల్లు అర్లున్ అర్థనగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కూడా అండర్ వేర్ లో కనిపించి చాలా పోటాపోటీగా డైలాగ్స్ చెప్పారు. కానీ ప్రేక్షకులను ఆ సీన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్లైమాక్స్ సీన్‌పై దర్శకుడు సుకుమార్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్ ఇద్దరూ ప్యాంట్ షర్ట్ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు. నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నా. కానీ, తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని తెలిసి అప్పటికప్పుడు మార్పులు చేశాం అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. మొదటి భాగంతో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేయగా అసలు కథను సెకండ్ పార్ట్‌లో చూపించారు.