రోజూ ఉదయం నిద్ర లేవగానే అనేక మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. బ్రష్ కూడా చేయకుండానే టీ, కాఫీలను సేవిస్తుంటారు. అయితే ఇలా టీ, కాఫీలను తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ చాలా మంది పట్టించుకోరు. అయితే వీటికి బదులుగా చిన్న బెల్లం ముక్కను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఉదయాన్నే పరగడుపునే బెల్లం ముక్కను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. బెల్లంను ఇలా తీసుకోవడం వల్ల పలు వ్యాధుల నుంచి బయట పడవచ్చని వారు చెబుతున్నారు.
బెల్లంను ఈ విధంగా తీసుకోవడం వల్ల ఉదయం నుంచే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. రోజంతా కొవ్వు కరుగుతూనే ఉంటుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బెల్లంలో పొటాషియం, మెగ్నిషియం, విటమిన్ బి1, బి6, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి క్యాలరీలను కరిగించడంలో సహాయ పడతాయి. అందువల్ల రోజూ బెల్లాన్ని ఈ విధంగా తింటుంటే బరువును తగ్గించుకోవచ్చు. జీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది.
బెల్లంను తిని గోరు వెచ్చని నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. సుఖ విరేచనం అవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. మనం నిత్యం కాలుష్య భరితమైన వాతావరణంలో ఉంటున్నాం. అలాంటి గాలినే పీలుస్తున్నాం. దీని వల్ల ఊపిరితిత్తులకు ఎంతగానో నష్టం కలుగుతోంది. మన ఊపిరితిత్తుల్లో కాలుష్య కారకాలు చేరి మనకు అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. అయితే ఇలా జరగకుండా ఉండాలన్నా, ఊపిరితిత్తులు క్లీన్ అవ్వాలన్నా రోజూ బెల్లం తినాల్సి ఉంటుంది.
బెల్లం తినడం వల్ల మానసిక సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. దీంతో రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. అలాగే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల్లోని స్టోన్స్ కరిగిపోతాయి. ఇలా బెల్లం తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.