ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన భామ దీపికా పదుకొణె. అలాగే బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో టాప్ లిస్టులో ఉంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా విభిన్నంగా అడుగులు వేస్తూ వస్తుంది. ఒక విధంగా పెళ్లి తర్వాత కూడా స్పీడ్ పెంచింది అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు పలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిపాలవడం కూడా జరుగుతోంది.తాజాగా దీపికా పదుకొణే చిన్ననాటి పిక్ ఒకటి నెట్టింట హాల్చల్ చేస్తుంది.ఇది చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు.
చిన్నప్పుడు కూడా దీపికా భలే క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ షట్లర్ ప్రకాశ్ పదుకొణెకు కూతురు అయిన దీపిక.. తండ్రిలా స్పోర్స్ ప్లేయర్ కాకుండా నటిగా మారి తొలి చిత్రం కన్నడలో చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలీవుడ్ షిప్ట్ అయిపోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతలు పొందాక పలు ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె త్వరలోనే టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది దీపికా. అందులో ఒకటి కల్కి 2.
ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – దీపికా తొలిసారిగా కలిసి నటించిన చిత్రం ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.550 కోట్లతో భారీ స్థాయిలో 2వ పార్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మరోవైపు దీపికా పదుకొణే పలు హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.