హిందూ పురాణాల్లో హనుమంతుడు ఒక సూపర్ హీరో. సీతాదేవిని లంక నుండి తీసుకువచ్చేందుకు రాముడికి హనుంమంతుడు ఎంతగానో సహాయపడతాడు. ఏకంగా కొండనే తన ఒంటి చేత్తో లేపే సామర్థ్యం హనుమంతుడి సొంతం. పొడవాటి తోకతో కండలు తిరిగిన దేహంతో కనించే హనుమంతుడి ఆకారం ఏ సూపర్ హీరోకు తీసిపోదు. అందువల్లే చిన్నపిల్లలు కూడా ఎక్కువగా హనుమంతుడిని ఇష్టపడుతుంటారు. భయం వేసినా చీకట్లో ఒంటరిగా ఉన్నా హనుమంతుడినే తలుచుకుంటారు.
ఇక వారంలో ప్రతి శని, మంగళవారాలు హనుమంతుడిని కొలుస్తుంటారు. హనుమంతుడిని ఆంజనేయుడు, హనుమాన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. హనుమాన్ జయంతిని కూడా హిందువులు ఓ పెద్ద పండుగలా జరుపుకుంటారు. అయితే హనుమాన్ జయంతి ఇతర పండగల్లా కాకుండా ఏడాదికి రెండు సార్లు వస్తుంది. అలా రెండు సార్లు హనుమాన్ జయంతి రావడం వెనక కారణాలు ఏంటన్నది ఎవరికీ తెలియదు. కాబట్టి అసలు ఏడాదికి హనుమాన్ జయంతి రెండుసార్లు ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం….రామాయణం ప్రకారంగా సీతాదేవిని రావణుడు తీసుకువెళ్లినప్పుడు రాముడు హనుమంతుడితో కలిసి వెతకడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో హనుమంతుడు మంగళవారం నాడు సీతా దేవి ఆచూకీని కనుగొంటాడు.
ఆ రోజు చైత్రమాసం చిత్త నక్షత్రం పౌర్ణమి…ఆ రోజున హనుమంతుడు అశోకనగరాన్ని నాశనం చేయడంతో పాటూ లంకను తగలబెడతాడు. ఆరోజున హనుమంతుడి విజయంగా చెప్పుకుని హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఇది ప్రతి సంవ్సరం ఎప్రిల్ లో వస్తుంది. కానీ అసలైన హనుమాన్ జయంతి వైశాఖమాసం శుక్లదశమి రోజున జరుపుకోవాలి. ఇది మే నెల చివరిలో వస్తుంది. పూర్వభద్రపాద నక్షత్రం చంద్రుడితో పాటూ జన్మిస్తాడు. ఇది అసలైన హనుమాన్ జయంతి.