మనం ప్రతిరోజు రోడ్డుమీద అంబులెన్స్ ని చూస్తూ ఉంటాం. అంబులెన్స్ వాహనం మీద అంబులెన్స్ అని రివర్స్ లో రాసి ఉంటుంది. అయితే అలా రివర్స్ లో ఎందుకు రాసి ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. అలాగే అంబులెన్స్ మీద ప్లస్ అనే గుర్తు ఉంటుంది. ప్లస్ గుర్తుకు వైద్యానికి సంబంధం ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు. అయితే అలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలుగా రోడ్డుమీద వాహనాల మీద వెళ్లేవారు వెనుక ఏ ఏ వాహనాలు వస్తున్నాయో తెలుసుకోవడానికి సైడ్ మిర్రర్స్ లో చూస్తూ ఉంటారు. అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెనుక అంబులెన్స్ వచ్చినప్పుడు అంబులెన్స్ వాహనం మీద అంబులెన్స్ అని రివర్స్ లో రాసి ఉంటుంది గనుక మనం సైడ్ మిర్రర్స్ లో చూసినప్పుడు అంబులెన్స్ అని క్లియర్ గా కనబడుతుంది. అందువల్ల మనం అంబులెన్స్ కు దారి ఇచ్చి అది వెళ్లడానికి మనం సహాయ పడతాం. నార్మల్ గా అంబులెన్స్ అనేది ప్రమాద స్థితిలో ఉన్న రోగిని హాస్పిటల్ కి తీసుకు వెళ్లడానికి ఉపయోగించే వాహనం.
అందువల్ల రోడ్డు మీద మనం అంబులెన్స్ కి దారి ఇస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. అలాగే అంబులెన్సు కి ప్లస్ గుర్తు కి సంబంధం ఏమిటంటే.. ఎమర్జెన్సీ సేవలు చేయడానికి, రక్తదానం అందించడానికి రెడ్ క్రాస్ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే ఈ సంస్థకు చిహ్నంగా ప్లస్ గుర్తు వాడతారు. దీని సేవలను గుర్తించి రెడ్ క్రాస్ సంస్థ కు మూడు సార్లు నోబెల్ శాంతి బహుమతి కూడా ఇచ్చారు. అందువల్లే రెడ్ క్రాస్ సంస్థ కు చిహ్నంగా ప్లస్ గుర్తును అంబులెన్స్ మీద వాడతారు. అలాగే రోడ్డుమీద అంబులెన్స్ వచ్చినప్పుడు దానికి దారి ఇవ్వడం వల్ల మీ వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. దయచేసి అంబులెన్స్ కి దారి ఇవ్వండి.