టాలీవుడ్ విజయవంతమైన దర్శకుడు కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఆచార్య మాత్రం బాక్సాఫీసు ముందు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ ఒక్క సినిమా మినహా అన్ని సినిమాలు… ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి.
అయితే కొరటాల శివ సినిమాలో ఒక కామన్ పాయింట్ వుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాలలో దాదాపు అందరు హీరోలు ఒక బ్యాగ్ వేసుకుని కనిపిస్తారు. జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే మిర్చి సినిమాలో ప్రభాస్… బ్యాగ్ పట్టుకుని ఎంట్రీ ఇస్తారు.
అటు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు, ఆచార్య మూవీ లో చిరంజీవి కూడా బ్యాగ్ వేసుకొని కనిపిస్తారు. సినిమా మొత్తం కాకపోయినా ఏదో ఒక సందర్భంలో ఈ బ్యాగ్ మాత్రం సినిమాల్లో హీరోలు ఖచ్చితంగా వాడతారు. ఇది కొరటాల శివ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో కనిపిస్తుంది.