సాధారణంగా మన ఇండ్లలో పెద్దవారు రాత్రిపూట గోర్లను కట్ చేయకూడదని.. అలాగే ఇంట్లో గోర్లు కొరక కూడదని అంటుంటారు. రాత్రిపూట గోర్లను ఎందుకు కట్ చేయకూడదో దానికి కారణం ఏంటో ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలేదు. కానీ దానికి సమాధానం ఏంటో మీరు ఇప్పుడు తెలుసుకోండి..?
గోర్లు ఎప్పుడు కట్ చేయాలంటే..?
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ వారు చెప్పిన దాని ప్రకారం.. గోర్ల లో కెరోటిన్ అనే పదార్థం ఉంటుందని కాబట్టి స్నానం చేసిన తర్వాతనే గోర్లను కట్ చేయడం మంచిదని భావిస్తున్నారు. మనం స్నానం చేసిన తర్వాత చాలాసేపటికి సబ్బు లేదా నీళ్లలో నానడం వల్ల తేలికగా కత్తిరించవచ్చు. అయితే రాత్రి సమయంలో గోళ్ళు కత్తిరించడం వల్ల గోర్లు తేమ లేకపోవడం వల్ల గట్టిగా తయారవుతాయి. దీనివల్ల నొప్పి ఎక్కువగా వస్తుంది.
అలాగే రాత్రి వేళల్లో గోళ్ళు కత్తిరించడం పూర్వ కాలం ప్రకారం చూసుకుంటే మరో కారణం కూడా ఉంది. అదేంటంటే.. పాత రోజుల్లో నెయిల్ కట్టర్ ఉండేది కాదు. ఆ సమయంలో కత్తితో కానీ, పదునైన వాటితో కానీ గోర్లను కత్తిరించుకునేవారు. వారికి అప్పుడు కరెంటు కూడా ఉండేది కాదు. అందువల్ల రాత్రి సమయంలో గోర్లను కత్తిరించకూడదు అని పెద్దలు అనేవారు. ఇది కాలం గడిచేకొద్దీ ఒక మూఢ నమ్మకం గా మారిపోయింది. దీన్ని చాలా ఇళ్లలో ఇప్పటికీ నమ్ముతారు.
గోర్లు తడిగా ఉంచాలి :
గోర్లను కత్తిరించడానికి ముందు గోర్లను తేలికపాటి నూనెలో లేదా నీటిలో నానబెట్టాలి. దీని వల్ల అవి మృదువుగా తయారై, ఇబ్బంది లేకుండా కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాటిని కట్ చేసిన తర్వాత తడి చేయడం మాత్రం మర్చిపోవద్దు. గోళ్లు కట్ చేసిన వెంటనే శుభ్రంగా కడుక్కోవాలి.