స్టూడెంట్ నెంబర్ వన్ నుండి RRR వరకు అపజయం ఎరుగకుండా డజన్ కి పైగా సినిమాలతో బాక్సాఫీస్ పైన దండయాత్ర చేశాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే ఈ సినిమాల హిట్ కి కెప్టెన్ గా రాజమౌళికి 100% క్రెడిట్ ఇవ్వాలి కానీ ఒక్క ఈ సినిమాలకు రాజమౌళితో పాటుగా క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఆయన మరెవరో కాదు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు. రాజమౌళి సినిమా పట్టాలు ఎక్కేది విజయేంద్ర ప్రసాద్ గారు పెన్ను పట్టుకొని కథ రాసిన తరువాతే, స్టూడెంట్ నెంబర్ వన్ నుండి RRR వరకు రాజమౌళి సినిమాలన్నీ రాసింది ఆయన తండ్రి విజయేంద్ర గారు. ఈగ, మర్యాద రామన్న సినిమాలు తప్ప మిగతావన్నీ రాసింది విజయేంద్ర గారు.
అలా అని పుత్రుడికి రాస్తాడు అనుకుంటే మీరు పొరపడ్డట్టే, ఆయన అటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి రాస్తాడు. ఇటు తమిళ్ లో విజయ్ కి స్టోరీస్ రాస్తాడు. విజయేంద్ర ప్రసాద్ గారు రాసిన కథలకి ఒక పాన్ ఇండియన్ అప్పీల్ కూడా ఉంది. ఇది ఇప్పుడు కాదు 90ల చివర్లో ఇప్పటికీ, ఇకముందు కూడా ఉంటుంది. రాజమౌళి తండ్రిగా మనకు మాత్రమే తెలిసిన విజయేంద్ర ప్రసాద్ గారు ఒక సక్సెస్ ఫుల్ రైటర్ అందుకు ఈ సినిమాలే ఒక పెద్ద ఉదాహరణ.
#1 బొబ్బిలి సింహం
#2 సమరసింహారెడ్డి
#3 సింహాద్రి
#4 సై
#5 చత్రపతి
#6 విక్రమార్కుడు
#7 యమదొంగ
#8 మగధీర
#9 బాహుబలి 1&2
#10 బజరంగీ భాయిజాన్
#11 మెర్సల్
#12 మణికర్ణిక:దిక్విన్ ఆఫ్ ఝాన్సీ
#13 తలైవి
#14 జాగ్వార్
#15 RRR