మొబైల్స్ తయారీదారు లావా.. ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్ ధరకే లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. లావా యువ స్మార్ట్ పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో యూనిసోక్ 9863ఎ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 3జీబీ ర్యామ్ కూడా ఉంది. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో ఏఐ కెమెరాను కూడా అందిస్తున్నారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సైడ్ భాగంలో ఇచ్చారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ సదుపాయం ఉంది. ఎఫ్ఎం రేడియో కూడా వస్తుంది. లౌడ్ స్పీకర్‌ను కింది వైపు ఇచ్చారు.
ఈ ఫోన్ మొత్తంగా 193.3 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ సదుపాయం కూడా ఉంది. డ్యుయల్ బ్యాండ్ వైఫైని ఇందులో అందిస్తున్నారు. బ్లూటూత్ 4.2 సదుపాయం ఇందులో ఉంది. యూఎస్‌బీ టైప్ సి ని ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. దీనికి 10 వాట్ల చార్జింగ్‌ను అందిస్తున్నారు. లావా యువ స్మార్ట్ స్మార్ట్ ఫోన్ గ్లాసీ బ్లూ, గ్లాసీ వైట్, గ్లాసీ లావెండర్ కలర్ వేరియెంట్లలో లాంచ్ అయింది. ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్‌ను రూ.6వేలకే అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై 1 సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది.