ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం, డయాబెటిస్, గుండె సమస్యలు రాకుండా ఉంటాయని అందరికీ తెలుసు. వాకింగ్ అంటే స్లోగా నడువడమే కదా అనుకుంటారు. కాదు. వాకింగ్‌లో ఆరు రకాలు ఉన్నాయి. మరి అవేంటి. వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బ్రిస్క్ వాకింగ్.. సాధారణంగా నడిస్తే అది వాకింగ్ అంటారు. వేగం కొంచెం పెంచితే దాన్నే బ్రిస్క్ వాకింగ్ అంటారు. ఈ వాకింగ్ రన్నింగ్ చేసినంతటి ఫలితాన్ని ఇస్తుంది. క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి.
పవర్ స్ట్రైడింగ్.. ఇది బ్రిస్క్‌వాకింగ్‌కు కొంచెం భిన్నంగా అన్నమాట. బ్రిస్క్ వాకింగ్ చేస్తూ రెండుచేతులనూ ఎక్కువగా ఊపుతూ నడిస్తే దాన్నే పవర్ స్ట్రైడింగ్ అంటారు. దీనివల్ల కొవ్వు త్వరగా తగ్గి, మెటాబాలిజం స్పీడ్ అవుతుంది. ఫలితంగా బరువు వేగంగా తగ్గుతారు. స్టెయిర్‌వెల్ వాక్.. నడవడానికి స్థలం లేనప్పుడు అపార్ట్‌మెంట్‌లోని మెట్లు ఎక్కుడం, దిగడం లాంటివి చేయడాన్నే స్టెయిర్‌వెల్ వాక్ అంటారు. దీన్నివల్ల గంటకు 200కు పైగానే క్యాలరీను ఖర్చు చేయవచ్చు. కంటిన్యూగా గంటసేపు చేయకుండా మధ్య మధ్యలో కొంచెం గ్యాపునిస్తే దీనివల్ల మరింత సమర్థవంతమైన ఫలితాలను పొందవచ్చు. పూల్ వాకింగ్.. సముద్రపు ఒడ్డున నీళ్లలో వాకింగ్ చేయడాన్ని పూల్ వాకింగ్ అంటారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. అర్థరైటిస్, వెన్నునొప్పి, ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలు ఉన్నవారికి పూల్ వాకింగ్ చాలామంచిది.
అప్‌హిల్ క్లైంబ్.. ఎత్తైన ప్రాంతాలకు వాకింగ్ చేయడాన్నే అప్‌హిల్ క్లైంబ్ అంటారు. దీనివల్ల తొడ కండరాలు, పిక్కలు దృఢంగా మారుతాయి. హామ్ స్ట్రింగ్ గాయాలకు ఉపశమనం కలుగుతుంది. ట్రెడ్‌మిల్ వాకింగ్.. బయట వాకింగ్ చేయడానికి వీలుకాని వారు ట్రెడ్‌మిల్ వాకింగ్ చేయవచ్చు. ట్రెడ్‌మిల్ మిషన్‌పై చేస్తారు కనుక దీనికి ఆ పేరు వచ్చింది. దీనిపై పలు సెట్టింగ్స్‌ను బట్టి బ్రిస్క్ వాక్‌ను కూడా ట్రై చేయవచ్చు.