ఇది జపాన్ లో జరిగిన వాస్తవం. సినిమా థియేటర్లలో , బస్ లలో ఎదుటి సీట్ల మీద కాళ్లు పెట్టే అలవాటున్న మనదేశ కుర్రాడు జపాన్ లో పొందిన అనుభవం. భారతదేశానికి చెందిన ఓ యువకుడు వ్యక్తిగత పనిమీద జపాన్ వెళ్ళాడు. జపాన్ లో దిగగానే అక్కడి లోకల్ ట్రైన్ ఎక్కి తన వెళ్ళాల్సిన ప్రదేశానికి బయలుదేరాడు. అలా ట్రైన్ లో కూర్చొని సిటీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే తనకు ఎదురుగా ఖాళీ సీట్ కనిపించడంతో తన కాళ్లను తీసి ఆ సీట్ లో పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు.
పక్క సీట్ లో కూర్చున్న జపాన్ కు చెందిన ఒక పెద్దమనిషి, ఇదంతా గమనించి యువకుడు కాళ్ళు పెట్టిన సీట్ లో కూర్చొని, అతడి పాదాలను తన ఒడిలో పెట్టుకున్నాడు. అది చూసి ఆ యువకుడు షాక్ అయ్యాడు. సార్ ‘ మీరు కూర్చున్న సీట్ వదిలేసి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు.? కూర్చుంటే కూర్చున్నారు కానీ నా పాదాలను ఎందుకు మీ ఒడిలో పెట్టుకున్నారు అని అడిగాడు’ ఆ యువకుడు.
‘చూడు బాబు మీరు మాదేశ ప్రభుత్వ ఆస్తులను,(ప్రజల సంపదను) అవమానకరంగా ఉపయోగిస్తున్నారు. నాకు చాలా కోపం వచ్చింది. కానీ మీరు మాదేశానికి వచ్చిన అతిథి. మిమ్మల్ని అందరిముందు అవమానించడం పద్ధతికాదు. అయితే మీకిలా బస్సులలో, రైళ్ళలో ఎదుటిసీట్లపై పాదాలు పెట్టుకునే అలవాటు ఉండవచ్చు కానీ మాకది అవమానకరంగా ఉంది. అందుకనే మా ప్రభుత్వ సంపదను కాపాడుకుంటూ, వచ్చిన అతిథితో అమర్యాదకంగా ప్రవర్తించకుండా నీ సౌకర్యం గురించి ఆలోచించి నీ పాదాలను నా ఒడిలో ఉంచుకున్నాను అని ఆ యువకుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడా జపనీయుడు. అతని సమాధానంతో సిగ్గుతో తలదించుకొని క్షమించమని కోరాడు ఆ యువకుడు. ముందరి సీట్లపై కాళ్లు పెట్టకూడదు ఇది మనకు తెలిసిన సాధారణ విషయమే..పాటించడానికి వస్తే కాస్త పక్కకు పెడతాం ఎందుకంటే ఎవడి కంఫర్ట్ వాడిది.!?