తెలుగు ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ బ్యానర్ కు చాలా పేరుంది.. ఇప్పటివరకు ఈ బ్యానర్ లో నటించని హీరోలు అంటూ లేరు. అలాగే ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాలు అంటే జనాల్లో కూడా భారీగా అంచనాలు ఉంటాయి.. అప్పట్లో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ నుంచి తాజాగా వచ్చిన దుల్కర్ వరకు ఈ బ్యానర్ లో నటించని స్టార్లు అంటూ లేరు. అయితే ఈ బ్యానర్ ద్వారా అనేక హీరో హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వారెవరో ఓ లుక్కేద్దాం..
వైజయంతి మూవీస్ బ్యానర్ పై రాజకుమారుడు చిత్రంలో మహేష్ బాబు ని లాంచ్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ మొదటి చిత్రం నిన్ను చూడాలని, కానీ ఆయన ముందుగా సైన్ చేసిన చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్. దీనికి వైజయంతి మూవీస్ నిర్మాణ భాగస్వామిగా వచ్చింది. గంగోత్రి సినిమా తో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మూవీ కి నిర్మాణ భాగస్వామిగా వైజయంతి మూవీస్ వ్యవహరించింది.
నారా రోహిత్ బాణం సినిమాను కూడా వైజయంతి మూవీస్ లాంచ్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లో లెంగ్త్ పాత్రను లాంచ్ చేసింది వైజయంతి మూవీస్. మమ్ముట్టి కొడుకు ను తెలుగులో మహానటి తో లాంచ్ చేసింది వైజయంతి నిర్మాణ సంస్థ.. అలాగే సీతారామం కూడా చేశారు. సీతారామం మూవీ లో సీత పాత్రలో నటించిన మృణాల్ ను తెలుగులో పరిచయం చేసింది వైజయంతి మూవీస్ సంస్థ.