Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

Admin by Admin
July 5, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీరు చూసే ఉంటారు.. చాలా మందికి చేతికి వెరైటీ రింగులు పెట్టుకుంటారు. కొందురు రంగురాళ్లు పెట్టుకుంటే.. కొందరు తాబేలు ఉంగరం ధరిస్తారు. అందం కోసం వీటిని వేసుకున్నారు అనుకుంటే పొరపాటే. ఇలాంటివి వేసుకోవడం వెనుక పెద్ద స్టోరీయే ఉంటుంది. వారి జాతకానికి, రాశికి తగ్గట్టు ఏది మంచిదో జ్యోతిష్కులతో చూపించుకోని మరీ వేసుకుంటారు. ఇదంతా ఒక టైప్‌ ఎనర్జీ, వైబ్స్‌లో భాగమే. తాబేలు ఉంగరం ధరించడానికి వెనుక ఉన్న కారణాలు, ఆ ఉంగరం వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈరోజు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరం ధరించడం శుభప్రదం. లక్ష్మీ దేవికి ప్రీతికరమైందిగా తాబేలును భావిస్తారు. తాబేలు నాలుగు కాళ్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఫలితంగా ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం, అనుకూలత ఏర్పడుతుంది. ఇదే సమయంలో ఆర్థిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది. కొన్ని రాశుల వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతారు.

చాలా మంది ఈ ఉంగరం పురోగతికి చిహ్నంగా భావిస్తారు. ఈ ఉంగరం అనారోగ్యాలను కూడా దూరం చేస్తుందని కొందరు పేర్కొంటున్నారు. ఈ ఉంగరం మకరరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంటే వేరే రాశుల వాళ్లు వేసుకుంటే వేస్టా అనుకుంటారేమో.. అలా ఏం ఉండదు. ఇలాంటి ఉంగరాలు, రంగురాళ్లు ధరించే ముందు మీరు కచ్చితంగా పండితుల సలహా తీసుకోవడం ఉత్తమం. మీ రాశికి తగ్గట్టు ఏది మంచిదో చూసి వాళ్లు చెప్తారు. కొన్నిసార్లు మీకు ఇవి చేటు కూడా చేయొచ్చు. కాబట్టి తెలుసుకుని ధరించాలి. మేష రాశికి అధిపతి అంగారకుడు. ఈ గ్రహం ప్రభావం వల్ల ఈ రాశి ప్రజలు తాబేలు ఉంగరం ధరించడం మంచిది కాదు. ఒకవేళ ధరించినట్లయితే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

people with these zodiac signs should not wear tortoise ring

జ్యోతిషశాస్త్రం ప్రకారం కన్యా రాశికి అధిపతి బుధుడు. అందువల్ల తాబేలు ఉంగరం ఈ రాశి వారు ధరించడం వల్ల ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. వృశ్చిక రాశికి కూడా అధిపతి అంగారకుడు. ఈ కారణంగా వృశ్చిక రాశి ప్రజలు తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల కుజ దోష సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మీనం.. ఈ రాశి వారు తాబేలు ఉంగరాన్ని మర్చిపోయి కూడా ధరించకూడదు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ కారణంగా తాబేలు ఉంగరాన్ని మీన రాశి వారు ధరించినట్లయితే బృహస్పతి స్థానం బలహీనపడుతుంది. ఫలితంగా ఈ రాశి ప్రజలు ధన నష్టం జరగడమే కాకుండా పలు రకాల ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags: tortoise ring
Previous Post

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

Next Post

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.