ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకుపోయే అత్తిపత్తి మొక్క గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అవును, ఇప్పటి వారికైతే తెలిసే అవకాశం లేదు. కానీ ఒకప్పటి తరం వారికైతే ఈ మొక్క గురించి ఇట్టే తెలిసిపోతుంది. దాన్ని వారు ఎక్కడ ఉన్నా గుర్తించగలుగుతారు కూడా. అయితే ఈ మొక్కకు ముడుచుకుపోయే స్వభావం మాత్రమే కాదు, మన శరీరంలోని అనారోగ్యాలను తరిమికొట్టే గుణం కూడా ఉంది. వాతాన్ని హరించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, మూత్రం సాఫీగా వెలువడేందుకు, ముక్కు నుంచి కారే రక్తం ఆగేందుకు, గాయాలను మానిపించేలా చేసేందుకు, జ్వరం, గుండె దడ, శ్వాసకోశ సమస్యలను తగ్గించుకునేందుకు ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఈ మొక్క వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అత్తిపత్తి మొక్క గింజలు, చింత గింజల లోపలి పప్పు, నీరు గొబ్బి గింజలను సమ పాళ్లలో తీసుకుని వాటిని మర్రి పాలలో ఒక రాత్రంతా నానబెట్టాలి. అనంతరం వాటిని తీసి మెత్తగా నూరి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్నపాటి మందుగోలీల్లా మార్చుకోవాలి. అలా చేసిన గోలీలను ఎండబెట్టి నిల్వ చేయాలి. వీటిని రెండు పూటలా 3 మాత్రల చొప్పున వేసుకోవాలి. అనంతరం ఆవు పాలు, కండ చక్కెర కలిపి తాగాలి. దీంతో 40 రోజుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. అంతేకాదు, మూత్రంలో వీర్యం పోవడం, శీఘ్రస్కలనం, నపుంసకత్వం, నరాల బలహీనత వంటి సమస్యలు పోయి ధాతుపుష్టి కలుగుతుంది. ఈ మాత్రలను మింగినన్ని రోజులు వేడి, పులుపు, కారం పదార్థాలను తీసుకోకూడదు. శృంగారంలో పాల్గొనకూడదు.
అత్తిపత్తి మొక్క ఆకు, మంచి గంధం పొడిలను సమానంగా తీసుకోవాలి. వీటిని కలబంద గుజ్జుతో కలిపి మెత్తగా నూరి మాత్రలను తయారు చేయాలి. వాటిని నీడలో ఎండబెట్టాలి. అనంతరం రోజూ రెండు పూటలా ఒక మాత్ర చొప్పున మింగాలి. దీంతో కొద్ది రోజుల్లో సెగ రోగాలు తగ్గుతాయి. వీర్య వృద్ధి కూడా కలుగుతుంది. అత్తిపత్తి ఆకులను మెత్తగా నూరి నారి కురుపులపై వేసి కట్టు కడుతూ ఉంటే అవి నశించిపోతాయి. అయితే గోంగూర, వంకాయ, మాంసం, చేపలు వంటివి మాత్రం ఆ సమయంలో తినకూడదు. అత్తిపత్తి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఒక భాగం తీసుకుని దానికి రెండు భాగాల పటిక బెల్లం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు పూటలా అర చెంచా పొడి చొప్పున మంచి నీటితో కలిపి తీసుకోవాలి. దీంతో రుతుక్రమం సరిగ్గా వస్తుంది. అయితే రుతుక్రమం రాగానే ఈ మిశ్రమం తీసుకోవడం ఆపివేయాలి. ఈ ఔషధాన్ని తీసుకునే సమయంలో నువ్వులు, గంజి, తీపి పదార్థాలను మానేయాల్సి ఉంటుంది.
అత్తిపత్తి వేర్లను మేక పాలతో లేదా గొర్రె పాలతో గంధంలా నూరాలి. ఆ గంధాన్ని పురుషులు తమ అరికాళ్లకు మర్దనా చేసుకుని రతిలో పాల్గొంటుంటే చాలా సేపటి వరకు వీర్య పతనం కాదు. అత్తిపత్తి ఆకు 5గ్రా., మిరియాలు 9 తీసుకుని ఒక కప్పు నీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి పరగడుపున 40 రోజుల పాటు సేవించాలి. దీంతో పాటు అత్తిపత్తి ఆకును ముద్దగా నూరి బోదకాలిపై పట్టులాగా వేసి కట్టు కడుతూ ఉంటే మంట, పోటు, బాధ తగ్గిపోతాయి. మాంసం, చేపలు, నంజు పదార్థాలను తినకూడదు. అత్తిపత్తి ఆకు తేనెతో మెత్తగా నూరి యోనికి పట్టిస్తూ ఉంటె యోని బిగువుగా మారుతుంది. తీపి పదార్ధాలను సేవించాలి. అత్తిపత్తి సమూల చూర్ణం, అశ్వగంధ దుంపల చూర్ణం సమంగా కలిపి ఉంచుకుని రాత్రి పూట తగినంత పొడిని నీటితో నూరి స్తనాలపై పట్టించి ఉదయం కడుగుతూ ఉంటే జారిన స్తనాలు బిగువుగా మారతాయి. పాలు, నెయ్యి, పండ్లు, తీపి తినాలి.
అత్తిపత్తి ఆకు 30గ్రా., మిరియాలు 2 గ్రా. తీసుకుని ఈ రెండింటిని మెత్తగా నూరి ఒక గ్రాము బరువు గల మాత్రలు చేసి గాలికి నీడలో ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. రెండు పుటలా ఒక మాత్ర గోరువెచ్చని నీటితో సేవిస్తూ ఉంటే చెల్దికురుపులు, మశూచికం, గండమాల హరించి పోతాయి. చేపలు, మాంసం, వేడి పదార్ధాలు నిషేధం. అత్తిపత్తి సమూల చూర్ణం 3 నుండి 5 గ్రా., పంచదార ఒక చెంచా కలిపి రెండు పుటలా సేవిస్తుంటే అతిసార విరేచనాలు, రక్త మొలలు హరించి పోతాయి. విరేచనకర పదార్ధాలు నిషేధం. సూర్య గ్రహణము లేక చంద్ర గ్రహణము రోజున అత్తిపత్తిని ధూప దీప నైవేద్యాలతో పూజించి వేరు తెచ్చి కడిగి ఆరబెట్టి దాన్ని రాగి తాయత్తులో పెట్టి మొలకు గాని, చేతికి గాని కట్టి ఉంచితే అంతకు ముందు వరకు సిగ్గు లేకుండా బరి తెగించి ప్రవర్తించే స్త్రీ, పురుషులు క్రమంగా తమ తప్పును తామే తెలుసుకుని సిగ్గు పడతారు.
పచ్చని పూలు పూసే అత్తిపత్తి చెట్టు కాడలను, తాటి కలకండను సమంగా కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి గాలిలో నీడకు బాగా ఆరబెట్టి రెండు పుటలా మర్రి చెక్క కషాయంతో ఒక మాత్ర సేవిస్తూ ఉంటే అతి మూత్రం హరిస్తుంది. అత్తిపత్తి ఆకులను ముద్దగా నూరి అందులో కొంచెం పసుపు కలిపి నూరి కురుపుల పైన, పుండ్ల పైన వేసి కట్టుకడుతూ ఉంటే క్రమంగా వ్రణాలు మాడిపోతాయి. అత్తిపత్తి చెట్టును సమూలంగా ఒక కేజీ తెచ్చి కడిగి నలగొట్టి అందులో 4 కేజీల నీళ్ళుపోసి ఒక రాత్రి నానబెట్టి ఉదయం పొయ్యి మీద పెట్టి ఒక కేజీ కాషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి ఆ కషాయంలో ఒక కేజీ నువ్వుల నునే పోసి తైలం మిగిలే వరకు మళ్లీ మరగ బెట్టాలి. తరువాత ఆ నూనెతో దీపం వెలిగించి పైన మంటతగిలేలా మట్టిముకుడు గాని, రాగి పళ్ళెం కాని పెట్టి మసి పారించాలి. తరువాత ఆ మసిని తీసి ఆవు నెయ్యి కలిపితే కాటుక అవుతుంది. రోజూ రాత్రి కళ్ళకు పెట్టుకుంటుంటే పొరలు, పూతలు, మసకలు తగ్గిపోతాయి.