Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

చిరంజీవి స్థాయిలో ఉండాల్సిన సుమన్.. ఎందుకలా అయ్యారు..!!

Admin by Admin
February 7, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ ,వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు పేర్లే ప్రధానంగా వినిపిస్తాయి. అయితే ఈ పేర్లతో పాటుగా ఆ తరం హీరోల్లో ఒకరిగా ఉండాల్సిన ఈ హీరో సినీ జీవితం మధ్యలోనే డిస్ట్రబ్ అయింది.. మరి ఆ హీరో ఎవరు.. అలా కావడానికి కారణం ఏంటో చూద్దాం.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో విలన్ గా, క్యారెక్టర్ చేస్తున్న నటుడు సుమన్.. అలనాడు సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆయన సినిమా థియేటర్ లోకి వచ్చింది అంటే జనాలు ఎగబడి మరీ చూసేవారు.. అలా స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే అతని జీవితంలోకి అనుకొని ఒక సంఘటన తీవ్రంగా కుంగదీసింది.. చిరంజీవి స్థాయిలో ఉండాల్సిన సుమన్ ను కిందకు దిగజార్చింది.. తమిళ ఇండస్ట్రీలో మొదటగా సక్సెస్ అయిన సుమన్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో 1982 ఎంట్రీ ఇచ్చి కేవలం రెండు సంవత్సరాల్లోనే సూపర్ స్టార్ పేరు తెచ్చుకున్నారు.

ఫైట్స్ లో కొత్త ట్రెండ్ సృష్టించి యాక్షన్ మూవీ ఇష్టపడేవారికి అభిమాన హీరో అయ్యాడు. ఆయనకు లేడీస్ లో కూడా ప్రత్యేకమైన స్థానం ఉండేది. అప్పటికే చిరంజీవి ఖైదీ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారు. దీంతో చిరంజీవి, సుమన్ మధ్య సినిమాల్లో పోటీ ఏర్పడింది. ఇద్దరు యువ హీరోలు అవ్వడం అన్ని విభాగాల్లో అదరగొట్టడం వల్ల వీరి మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. వీరి మధ్యలో బాలకృష్ణ రావడంతో ముగ్గురు టాలీవుడ్ ను ఏలేస్తారని అందరూ భావించారు. ఇక సుమన్ రెమ్యూనరేషన్ ఐదు లక్షలు నడుస్తోంది. అప్పటికి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు శ్రీదేవి లు మాత్రమే అంతా పారితోషకం తీసుకుంటున్నారు. అలాంటి సమయంలో సుమన్ డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే సుమన్ జీవితంలో ఒక విపత్కర పరిణామం చోటు చేసుకుంది. కొంతమంది కుట్ర పన్ని సుమన్‌ను గూండాగిరి, మరో కేసులో ఇరికించారు. కనీసం బెయిల్ కూడా రాకుండా నాలుగు నెలల పాటు సుమన్ దుర్భర జీవితాన్ని గడిపారు. ఆ సమయంలో ఆయనకు నలుగురైదుగురు తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదట.

what is the important incident happened in suman life

దీంతో సుమన్ మనోవేదనకు గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చినా సరే ఏదో గిల్టీ ఫీలింగ్ తో కుంగిపోయే వారు. అప్పటి వరకు ఆయన డేట్స్ కోసం ఎదురుచూసిన నిర్మాతలు, డైరెక్టర్లు అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. సుమన్ నిజంగానే తప్పు చేశారని నమ్మేవారు. కొంత మంది దీని వెనుక సినిమా స్టార్స్ ఉన్నారని పుకార్లు కూడా వచ్చాయి. మరీ ముఖ్యంగా చిరంజీవి హస్తం ఉందని అన్నారు. కానీ సుమన్ చిరంజీవి మంచి స్నేహితులు. ఇక సుమన్ జైలు నుంచి వచ్చాక అంత ముందులా క్రేజ్ లేకపోవడంతో రెమ్యూనరేషన్ తగ్గిపోయింది. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా పాత్రలు చేస్తూ వచ్చారు. చిరంజీవి స్థాయిలో ఉండాల్సిన ఆయన చివరికి చేయని నేరానికి జైలు పాలై తన సినీ జీవితమే నాశనం అయింది. ఈ విషయాలను సుమన్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

Tags: Suman
Previous Post

అబ్బాయికి అమ్మాయిలో నచ్చని 5లక్షణాలు..5వది చాలా ఇంపార్టెంట్..!

Next Post

గణనాథుడి నుంచి డబ్బు పాఠాలు నేర్చుకోండిలా..!!

Related Posts

ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025
lifestyle

బుద్ధుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే మీకు తిరుగు ఉండ‌దు..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.