అక్కినేని నాగచైతన్య విడాకుల తర్వాత నాగచైతన్య గురించి చాలామంది నెటిజెన్లు సెర్చ్ చేశారు. నాగచైతన్య, సమంత ను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకునేవాడు అనే ప్రశ్న చాలామంది సినీ అభిమానులలో మొదలు అవుతున్న ప్రశ్న. అయితే నాగచైతన్య, సమంత ఇద్దరు ప్రేమించే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య ప్రేమ విషయం ఇంట్లో తెలియక ముందు, వారి కుటుంబం ఎవరితోనైనా సంబంధం కలుపుకోవడానికి తయారు అయ్యిందా, అనే ప్రశ్న కూడా చాలామందిలో వచ్చింది.
అయితే కొన్ని ప్రశ్నలకు వివిధ సందర్భాలలో అక్కినేని నాగార్జున సమాధానం చెప్పారు. అయితే ఇప్పుడు మరొక సమాధానం చూద్దాం. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్ననాటి నుంచే రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహం బాలయ్య, నాగార్జున ల మధ్య కూడా సాగింది. వీరి మధ్య స్నేహం ఎలా ఉండేది అంటే, ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, రెండు కుటుంబాలు తప్పక హాజరు అయ్యేవి. అయితే వీరి స్నేహాన్ని బంధుత్వం గా మలుచుకోవడానికి కూడా బాలయ్య, నాగార్జున రెడీ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
బాలయ్య చిన్న కూతురిని నాగచైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని అప్పట్లో రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తుంది. అయితే అప్పుడు నాగచైతన్య, సమంత లవ్ మ్యాటర్ చెప్పడంతో ఈ వివాహ నిర్ణయం వెనక్కి వచ్చిందని తెలుస్తుంది. నాగచైతన్య, సమంతను లవ్ చేయకుంటే నందమూరి బాలయ్య కు అల్లుడుగా ఉండేవాడని పలువురు అంటున్నారు. కానీ సమంతకు విడాకులు ఇచ్చాక చైతూ ఇప్పుడు శోభితను పెళ్లి చేసుకున్నాడు.