బంగారం… దీని గురించి ఎవరికీ ప్రత్యే్కంగా చెప్పాల్సిన పనిలేదు. బంగారానికి ఎంత విలువ ఉంటుందో అందరికీ తెలుసు. దాదాపుగా అనేక ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు బంగారంపై ఆధారపడే ఉన్నాయి. మన దేశంలో అయితే బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందో అది మాటల్లో చెప్పలేం. ప్రధానంగా మహిళలు, ఆ మాటకొస్తే పురుషులు కూడా బంగారం ధరించడంపై మోజును ప్రదర్శిస్తుంటారు. అయితే బంగారం అసలు ఎక్కడి నుంచి వస్తుందో, దాన్ని ఎలా సంగ్రహిస్తారో తెలుసా..? తెలీదా..? అయితే తెలుసుకుందాం పదండి..!
బంగారం కూడా ఇనుము, బొగ్గులా గనుల్లోనే దొరుకుతుంది. అయితే అది అచ్చం బంగారంలా ఉండదు. ముడి ఖనిజంలా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పలు రకాల పదార్థాలన్నీ కలిసి అలా ముడి ఖనిజంలా ఏర్పడతాయి. దాన్ని పెద్ద పెద్ద ఫర్నేస్‌లలో వేడి చేసి, పలు రసాయనాలను కలుపుతూ బంగారాన్ని నెమ్మదిగా విడదీసి ద్రవం రూపంలోకి తెస్తారు.
అనంతరం దాన్ని అచ్చులు పోస్తారు. అలా బంగారం తయారవుతుంది. అయితే 24 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే ప్యూర్ గోల్డ్ అని అంటాం. అంటే అందులో ఇతర లోహాలేవీ కలవవు. కానీ 22, 18, 14 క్యారెట్లలో లభించే బంగారంలో మాత్రం బంగారం శాతం తగ్గుతుంది. మనం ఎక్కువగా ఉపయోగించేది 22 క్యారెట్ల బంగారం. తెలుసుకున్నారుగా..! బంగారం ఎలా తయారు చేస్తారో..!