ప్రస్తుత తరుణంలో చాలా మంది సహజీవనం చేసిన తరువాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఈ సంప్రదాయం సినీ ఇండస్ట్రీలోనే ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది దీన్ని పాటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ వయస్సు భేదం లేకుండా ఎవరు చిన్న, ఎవరు పెద్ద అయినా సరే ఆకర్షణ లేదా ప్రేమ ఉంటే.. కుదిరితే వివాహం చేసుకుని జీవితం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు పురుషులు తమకన్నా వయస్సు ఎక్కువ ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుని జీవిస్తున్న సంఘటనలను కూడా మనం చూస్తున్నాం. అప్పట్లో సచిన్ టెండుల్కర్ తనకన్నా వయస్సులో నాలుగేళ్లు పెద్ద అయిన అంజలిని వివాహం చేసుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ప్రేమకు హద్దులు లేవని, వయస్సు అడ్డం కాదని ఆ జంట నిరూపించారు. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.
అందుకని ఇద్దరి మనస్సులు కుదిరితే వయస్సు తేడా లేదు, ఎవరు ఎవర్ని అయినా పెళ్లి చేసుకోవచ్చు. కలసి జీవించవచ్చు. అయితే లేటు వయస్సులో వివాహం జరిగితే పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్ని కనడం. ఆ వయస్సులో అండాల విడుదల తగ్గుతుంది. ఒకవేళ పిల్లలు కావాలనుకుని కన్నా పుట్టిన వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయట. ఈ విషయం సైంటిస్టుల పరిశోధనల్లోనే వెల్లడైంది. కనుక ఒక తోడు కావాలి, పిల్లలు అక్కర్లేదు అనుకుంటే ఆ వయస్సులో వివాహం చేసుకోవచ్చు. కానీ పిల్లల కోసమే అయితే ఆ వయస్సులో వివాహం చేసుకోవాల్సిన పనిలేదు.
ఇక పురుషులకు లేటు వయస్సులో వివాహం జరిగితే వారికి పిల్లల్ని కనే సామర్థ్యం ఉంటుంది. కానీ పిల్లలకు 20 ఏళ్లు వచ్చేసరికి వీరు ఇంకా వృద్ధులు అయిపోతారు. అప్పటికి పిల్లలు ఇంకా సెటిల్ అవ్వరు. దీంతో పిల్లలను సెటిల్ చేయడం సమస్యగా మారుతుంది. కనుక ఈ విషయాలను అన్నింటినీ బేరీజు వేసుకుని వివాహం చేసుకోవడం ఉత్తమం. లేదు అనుకుంటే సహజీవనం చేయవచ్చు. ఇందుకు చట్టం కూడా అనుమతిస్తుంది. ఏది ఏమైనా రెండు మనస్సుల అంగీకారం ఉంటే వారు పెళ్లి చేసుకోవచ్చు లేదా కలసి ఉండవచ్చు. వారిని ఎవరూ ఆపలేరు.