మీ ప్రశ్నకి సమాధానంగా కొంత మంది మూర్ఖులు “మీకెందుకు, సంస్కారం లేదా, ఆ అమ్మాయి బతుకు వీధిలో పెట్టకు”, వగైరా వగైరా అని కామెంట్లు చేస్తారు. అలా అన్నవాళ్లందరూ కపట ధారులు.. ఏ ప్రశ్నైనా మనం చూసే దృష్టిని బట్టి, ఆ విషయం పై మనకున్న జ్ఞానాన్ని బట్టి సమాధానం ఉంటుంది. నా సమాధానం ఇది (స్వానుభవం నుంచి): ఆ అమ్మాయిని ఇంత సేపు ఏం చేస్తున్నావమ్మా అని శ్రేయోభిలాషులతో 1-2 సార్లు అడిగించి చూడండి. సముచితమైన సమాధానం వస్తే సరే. లేదంటే ఆ అమ్మాయి మిగతా వ్యవహారాల్లో ఎలా ప్రవర్తిస్తున్నదీ కూడా గమనించాలి.
తను వస్తువులని అమర్చుకునే విధానం, ఆలోచించే విషయాలు, ఏకాగ్రతతో పని చెయ్యగలగడం చేస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే కొన్ని రకాల మానసిక సమస్యలు ఉన్న వాళ్లు ఈ విధంగా తమ చుట్టు ఉన్న పరిస్థితుల నుంచి తమని తాము దూరం చేస్కోవడం ఇలాంటి అలవాట్ల ద్వారా మొదలు పెడతారు. తర్వాత తర్వాత దానికి సంతృప్తి చెందక అసలు ఇంట్లో నుంచే బయటికి రారు, లేదా ఎవరితో మాట్లాడరు, ఇంక రక రకాలుగా పరిణమించవచ్చు.
నేను స్వయంగా చూసిన ఒకరి విషయంలో ఈ బాత్రూంలో గంటల కొద్ది సమయం గడపడం అనే లక్షణంతో బయట పడిన సమస్య, చివరికి స్కిజొఫ్రీనియా అనే తీవ్ర మానసిక వైకల్యంగా తెలుసు కున్నాము. మీరు చెప్పే అమ్మాయి విషయం లో అలా జరగకపోతే బాగుండనే అనుకుందాము, కాని జాగ్రత్తగా గమనించడం, తనతో చర్చించడం అవసరం.